ETV Bharat / state

ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపులు ప్రారంభిస్తున్నాం : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - Minister Uttam on Sitarama Project

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 6:07 PM IST

Updated : Aug 13, 2024, 10:13 PM IST

Minister Uttam on Sitarama Project : ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపులను ప్రారంభిస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నీటి పారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జలసౌధలో మంత్రి పొంగులేటితో పాటు ఉత్తమ్​కుమార్​ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Minister Uttam on Sitarama Project
Minister Uttam on Sitarama Project (ETV Bharat)

Minister Uttam On Sitarama Project : సీతారామ ప్రాజెక్టును మరో రెండేళ్లలో సంపూర్ణంగా పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు పంపులను ప్రారంభిస్తామని మిగిలిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.

కమీషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలు పెంచారు : పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కమిషన్ల కక్కూర్తి కోసం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు, పేర్లు మార్చి అంచనాలు కూడా పెంచారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం అంచనాలు పెంచినట్లే సీతారామ ఎత్తిపోతల అంచనాలు కూడా భారీగా పెంచారని, కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు హెడ్​వర్క్స్ ఏపీలోకి వెళ్లిందని ఆరోపించారు. రూ.2000 కోట్లు అప్పటికే అయిన ఖర్చుకు అదనంగా మరో రూ.1500 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇందిరా, రాజీవ్ సాగర్ పనులు పూర్తయ్యేవని తెలిపారు.

హరీశ్​రావు అలా చెప్పడం హాస్యాస్పదం : రీడిజైనింగ్​లో మరో ఘోర తప్పిదం చేశారని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు చేపట్టడం తప్పుడు నిర్ణయమని, కాంగ్రెస్​కు మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో రీఇంజనీరింగ్ చేశారని పేర్కొన్నారు. 90 శాతం ప్రాజెక్టు పనులు తామే పూర్తి చేశామని మాజీమంత్రి హరీశ్​ రావు చెప్పడం హాస్యాస్పదమన్న ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం తుది అనుమతులు ఇవాళ్టి వరకు కూడా రాలేదని, బెనిఫిట్ కాస్ట్ రేషియో విషయంలో కూడా బీఆర్ఎస్​ అనుమతులు పొందలేదని పేర్కొన్నారు.

తాము నిరంతరం ఫాలో అప్ చేసి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చామని ఉత్తమ్​కుమార్​ తెలిపారు. సీతారామకు 65 టీఎంసీలు కేటాయిస్తూ త్వరలో అనుమతులు రానున్నాయని తెలిపారు. తమ ప్రయత్నంతోనే ప్రాజెక్టు డీపీఆర్ గోదావరి బోర్డుకు వచ్చిందని వివరించారు. బీఆర్ఎస్​ అధికారంలో వచ్చిన నెల రోజులకే గోదావరి జలాలను ప్రారంభించి కేటీఆర్ నెత్తిన నీళ్లు చల్లుకున్నారని, హరీశ్ రావు అది గుర్తు చేస్తున్నారేమోనని మంత్రి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ సర్కారు వచ్చాక పనులు వేగవంతం : ఏళ్ల తరబడి మోటార్లు, పంపులు పెట్టినా కనీసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్న ఆయన తాము వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. రూ.19000 కోట్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్​ ఖర్చు చేసింది కేవలం 7,436 కోట్లు మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామపై 500 నుంచి వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ మధ్యలో నిలిపివేసిన సీతమ్మ సాగర్​ను కూడా ముందుకు తీసుకెళ్లే విషయాన్ని ఆలోచిస్తున్నామని, సమ్మక్క సాగర్​కు కూడా నీటి కేటాయింపులు లేవని తెలిపారు.

Ponguleti Fires On BRS : రూ.7300 కోట్లతో 90 శాతం పనులు ఎలా అయ్యాయని ప్రశ్నించిన రెవెన్యుశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ ఎక్కువ వస్తుందనే మోటార్లు మాత్రం బిగించారని, నీరు ఇవ్వాలన్న చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. నాలుగేళ్లు మోటార్ పెట్టిన తర్వాత డ్రైరన్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్​ను గెలిపించింది ఒక్క సీట్లో మాత్రమేనని, అది కూడా తన బొమ్మతో తన శిష్యుడు గెలిచారని పొంగులేటి పేర్కొన్నారు.

బీఆర్ఎస్​కు వచ్చేది బిగ్​ జీరో : బీఆర్ఎస్​ నేతలు ముక్కు నేలకు రాసినా ఖమ్మం జిల్లా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరని, ఇక నుంచి ఖమ్మం జిల్లాలో వచ్చేది బిగ్ జీరో మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజలు, గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్​కు లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పూడిక తీసి మొత్తం చెరువులు నిర్మించినట్లు చెప్పుకొన్నారని, 75 శాతం పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టులకు రంగులు వేసి ప్రచారం చేసుకున్నారని ఆక్షేపించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు ఇచ్చి తీరతామని అన్నారు. బొమ్మలతో కాలక్షేపం చేసి పదేళ్లు ప్రజలతో ఆడుకున్నారని తాము చిత్తశుద్దితో పనిచేసి ఏడాది లోపే నీరు ఇస్తున్నామని పొంగులేటి పేర్కొన్నారు. కృష్ణాకు గోదావరి నీరు తరలించాలని జలయజ్ఞం ద్వారా వైఎస్ హయాంలో టెయిల్ పాండ్ ప్రాజెక్టు ఆలోచన చేశారని తెలిపారు.

బీఆర్ఎస్​ అతలాకుతలం అయ్యింది : ఖమ్మం మంత్రులు, ప్రజల పౌరుషం హరీశ్ రావుకు బాగా తెలుసని ఎంత తక్కువ గోకితే అంత మంచిదని శ్రీనివాసరెడ్డి సూచించారు. అధికారం పోయిన ఎనిమిది నెలలకే బీఆర్ఎస్​ నేతలు అతలాకుతలం అవుతున్నారని అధికారం కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మూడు, నాలుగు ఏళ్లు ఓపిక పట్టి మాట్లాడితే బాగుంటుందని సూచించిన ఆయన నెల రోజులు కాకముందే ప్రభుత్వాన్ని కూలుస్తామని అన్నారని గుర్తు చేశారు.

ఏటా ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సృష్టిస్తాం : ఉత్తమ్‌ - Uttam Released Sagar Water

స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన ఘోర తప్పిదం కాళేశ్వరం నిర్మాణం : మంత్రి ఉత్తమ్ - minister uttamkumar on kaleshwaram

Last Updated : Aug 13, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.