ETV Bharat / state

అక్టోబర్​లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి ఉత్తమ్‌ - Minister Uttam on New Ration Cards - MINISTER UTTAM ON NEW RATION CARDS

Uttam on New Ration Cards : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు, హెల్త్ కార్డు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రులు ఉత్తమ్​, పొంగులేటి ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబరులో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు.

Minister Uttam on New Ration Cards
Uttam on New Ration Cards (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 4:46 PM IST

Updated : Sep 16, 2024, 5:04 PM IST

Minister Uttam on New Ration Cards : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు నిత్యావసర సరకులకు, హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేలా విడివిడిగా అందజేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో ఇవాళ తన అధ్యక్షతన కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం 4వ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త సంచాలకులు ప్రియాంక ఆల, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, ఇతర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై తాము చర్చించామని ఉత్తమ్‌ తెలిపారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్ మాసంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది పక్రియ, ఖరారు ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారులు 2 కోట్ల 81 లక్షల 70 వేల మంది ఉన్నారని ప్రస్తావించారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌ భరోసా ఇచ్చారు.

స్మార్ట్ కార్డుగా రేషన్ కార్డు, హెల్త్ కార్డు : తెల్ల రేషన్‌ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంలో వచ్చే భేటీలో నిర్ణయిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశామని చెప్పారు.

ఇప్పటి వరకు 16 మంది ప్రజాప్రనిధులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని మంత్రి పొంగులేటి వివరించారు. ఆ సహేతుకమైన సూచనలు, సలహాలపై కూడా ఈ భేటీలో చర్చించామని అన్నారు. ప్రధాన విపక్ష బీఆర్​ఎస్​ ఇచ్చే సూచనల విషయంలో తాము ఎలాంటి భేషజాలకు పోకుండా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు రెండూ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యం అని పొంగులేటి పేర్కొన్నారు.

గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం - కొత్త రేషన్​ కార్డుల గైడ్​లైన్స్​ ఇవే - new ration cards in telangana

Last Updated : Sep 16, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.