ETV Bharat / state

తెలంగాణలో ఎక్కడా విత్తనాలు, రసాయ ఎరువుల కొరత లేదు : మంత్రి తుమ్మల - Minister Tummala Chitchat on seeds - MINISTER TUMMALA CHITCHAT ON SEEDS

Minister Tummala Nageswara Rao Chitchat : రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని ఎవరో సృష్టించిన అపోహలకు రైతులు లోనుకావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివక్షాలు రైతులతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్​లోని సచివాలయంలో మీడియాతో ఆయన చిట్​చాట్​ నిర్వహించారు.

Minister Tummala Nageswara Rao Chitchat
Minister Tummala Nageswara Rao Chitchat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 7:30 PM IST

Updated : May 29, 2024, 7:51 PM IST

Minister Tummala Nageswara Rao Chitchat on Purchase of Seeds : రాష్ట్రంలో విత్తనాల కోసం ఎక్కడా తొక్కిసలాట జరగలేదని, రైతులపై లాఠీ ఝళించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్​ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాలు, రసాయన ఎరువుల కొరత అంటూ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా నుంచి కొందరు ఎక్స్​ వేదికగా సామాజిక మాధ్యమాలకు పంపుతున్నారని తప్పుబట్టారు. హైదరాబాద్​లోని సచివాలయంలో మంత్రి మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు.

రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, రసాయన ఎరువుల కొరత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి, పచ్చిరొట్ట, ఇతర పంటల విత్తనాలు లేవంటూ ఎవరో సృష్టించిన అపోహలకు రైతులు లోనుకావద్దని మంత్రి చెప్పారు. విపక్షాలు రైతులతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. గత ఐదు మాసాలుగా విద్యుత్, సాగు నీరుపై రాజకీయం చేశారు, ఎలాంటి ఫలితాలు రాలేదని ఆక్షేపించారు. ఇంత రాద్ధాంతం చేసి ఆదుర్ధా సృష్టిస్తే విపక్షాలకు ఏమైనా క్షణికానందం కలిగిందేమో? అని విమర్శించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఎప్పికప్పుడు లేఖలు రాసి అనుమతులు తీసుకుని ఖరీఫ్ సీజన్ కోసం విత్తన నిల్వలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాలు అందుబాటులోకి చేర్చడం ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విపక్షాలు ఈ రకంగా బదనాం చేయాలనుకుంటే రైతులను ఆందోళనకు గురిచేయడమేనంటూ ఆరోపించారు. ఏ విధమైన అపోహలకు తావు లేదు. రాజకీయ లబ్ధి పొందాలని రైతులను తప్పుదోవ పట్టిస్తే నమ్మవద్దని మంత్రి తుమ్మల సూచించారు.

పచ్చిరొట్ట విత్తనాలకు అధిక డిమాండ్ : విత్తనాల కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు ధాటిగా పచ్చిరొట్ట విత్తనాలకు కొన్ని ప్రాంతాల్లో అధికంగా డిమాండ్​ ఏర్పడిందని తెలిపారు. ఆ విత్తనాలకు సంబంధించి అందుకు సంబంధించిన ఏజెన్సీలు, టీజీసీడ్స్​, నేషనల్​ సీడ్​ కార్పొరేషన్​లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రైతుల అవసరాలకు తగ్గట్లు అందుబాటులో ఉంచుతున్నారమని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జిలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటికే 20,518.40 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారన్నారు. విత్తనాలకు రాయితీ భరించేందుకు ప్రభుత్వం 1140.22 కోట్లు భరిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. విత్తనాల అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్నదాతలకు గుడ్ న్యూస్ - జులై నుంచి రైతు భరోసా అమలు - RYTHU BHAROSA SCHEME FROM JULY

విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి తుమ్మల - Minister Tummala On Seed Supply

Last Updated : May 29, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.