Minister Sridhar Babu Review On Rains Effect : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు రిపోర్ట్ వచ్చిందని మంత్రి తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో రివ్యూ చేశామన్నారు.
ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండడం వల్ల మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు అక్కడే ఉన్నారన్నారు. నీటిపారుదలశాఖ అధికారులు పోలీసు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితోనూ సమావేశం నిర్వహించామని, వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని ప్రకటించారు. అత్యవసర పరిధిలో తప్ప బయటకు ఎవరూ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.
విపత్కర పరిస్థితులను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు : విద్యుత్ రహదారులు రోడ్డు నిర్మాణాలను వెంటనే పునరుద్దరించాలని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కలెక్టరలతో నేరుగా మాట్లాడారని తెలిపారు. విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరైందికాదని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి హితవు పలికారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఇప్పటికైనా తన బుద్ది మార్చుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్రంలో పర్యటించాలని సీఎం కోరారని పేర్కొన్నారు.
"వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావొద్దు. రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వారిని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్‌ను ఆదేశించాం. ఇంతటి విపత్కర సమయాల్లో కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. ప్రజలకు సంబంధించి సంక్షోభ సమయం వచ్చినపుడు అందరూ కలిసి సహాయక చర్యలు చేపట్టాలి కానీ ఇలా రాజకీయాలు చేయడం తగదు." -శ్రీధర్ బాబు, మంత్రి
My thoughts are with the people of Telangana and Andhra Pradesh as they endure relentless rainfall and devastating floods.
— Rahul Gandhi (@RahulGandhi) September 2, 2024
I extend my deepest condolences to the families who have lost their loved ones. I urge Congress leaders and workers to mobilize all available resources to…
Rahul Gandhi Responded to Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, వరద సహాయక చర్యల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని శ్లాఘించారు. విపత్తులో నష్టపోయిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.