Minister Sridhar Babu Participate in Vivekananda Seva Samiti Program : రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridar Babu) అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు జరగడం మంచిది కాదని, రైతులు ఇక నుంచి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. వివేకానంద సేవా సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం తెలంగాణలో ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల(Farmers) కుటుంబాలకు వివేకానంద సేవా సమితి ఛైర్మన్ హనుమంతరావు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు.
Minister Sridhar Babu About Greatness of Farmers : ఉద్యోగ సహకారం కావాలని, లేకపోతే ఇంకా ఏదైనా సహకారం కావాలని తమ దగ్గరకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం అసలైన రైతును గుర్తించకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటివి సరిచేయాలనే ఉద్దేశంతో ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసిన రైతులు ఉంటారో వారికే రైతు పథకాలు(Rythu Schemes) ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు ఇస్తే వారికి కొంత మేలు జరుగుతోందని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదని, ఉన్న చట్టాలనే పటిష్ఠంగా చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వివేకానంద సేవా కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి : శ్రీధర్ బాబు
అనంతరం కూకట్పల్లి కాంగ్రెస్ ఇంఛార్జీ బండి రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ(Congress Six Guarantees)లలో నాలుగు గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. మరింత ప్రజలకు సేవ చేస్తామని, అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తామని అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్స్ ఛైర్మన్ కేవీ వరప్రసాద్ రెడ్డి, వివేకానంద సేవాసమితి ఛైర్మన్ హనుమంతరావు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎక్కువ మొత్తంలో రైతు కుటుంబాల నుంచి సభ్యులు సభకు హాజరయ్యారు.
మేడిగడ్డ కుంగిన తర్వాత వచ్చి చూడడం వల్ల ఏం లాభం : శ్రీధర్ బాబు
ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్ బాబు