ETV Bharat / state

శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్‌ నియామకం : శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu on BRS

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 6:15 PM IST

Updated : Sep 10, 2024, 7:16 PM IST

Minister Sridhar Babu on BRS : రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్​ను స్పీకర్​ నియమించారని తెలిపారు. బీఆర్ఎస్​ పార్టీపై శ్రీధర్​ బాబు పలు విమర్శలు గుప్పించారు. పీఏసీ ఛైర్మన్ నియామకం విషయంలో బీఆర్ఎస్​ విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

Minister Sridhar Babu on BRS
Minister Sridhar Babu on BRS (ETV Bharat)

Minister Sridhar Babu on BRS : శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్​ను నియమించారని మంత్రి శ్రీధర్​ బాబు స్పష్టం చేశారు. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్​గా అరికెపూడి గాంధీ నియామకంపై బీఆర్ఎస్​ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేను అని పీఏసీ ఛైర్మన్​ స్వయంగా చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ ఛైర్మన్​కు అభిప్రాయభేదాలుంటే తమకేం సంబంధమని శ్రీధర్ బాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని ధ్వజమెత్తారు.

'రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ నిబంధనలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి ఛైర్మన్​లు సభను నిర్వహిస్తారు. వారిని అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడటం సరైనది కాదు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందే. సభాపతి ఒక ప్రక్రియ ప్రకారం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ మాట్లాడడానికి లేదు"- శ్రీధర్ బాబు, మంత్రి

గతంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరు? : జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా బీఆర్ఎస్​ నేతల వైఖరి మారలేదని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ఫలితాల తర్వాత కూడా ఏదో జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారన్న శ్రీధర్​ బాబు అంత తిరిగిన తర్వాత కూడా ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని వెల్లడించారు.

'బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యవ్యవస్థలను కాలరాసింది. కూల్చివేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తారుమారు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఇబ్బంది పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్​కు కాకుండా పీఏసీ పదవి ఎవరికి ఇచ్చారో అందరూ చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల తీరు ఉంది' అని శ్రీధర్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు, సమాజం కోరుకునే విధంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదన్నారు.

'విపక్షాల ఉచ్చులో యువత పడొద్దు - ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం' - Minister Sridhar on six guarantees

'బీఆర్​ఎస్​ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం' - హరీశ్‌రావు, కేటీఆర్‌లకు మంత్రి శ్రీధర్​ బాబు కౌంటర్ - Sridhar Babu Counter to BRS Leaders

Last Updated : Sep 10, 2024, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.