ETV Bharat / state

చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపుతున్నారు : సీతక్క - SEETHAKKA REVIEW ON GURUKULAS - SEETHAKKA REVIEW ON GURUKULAS

Minister Seethakka Review on Gurukulas : రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

MINISTER SEETHAKKA REVIEW MEET
Minister Seethakka Review on Gurukulas (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 4:35 PM IST

Minister Seethakka Review on Gurukulas : రాష్ట్రంలో గురుకులాలపై వస్తున్న ఆరోపణలపై పంచాయితీరాజ్‌, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలపై ఆ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రతీక : టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలని, మానవత్వాన్ని జోడించి విద్యార్థులకు మంచి నాణ్యమైన సేవలను అందించాలని మంత్రి సీతక్క కోరారు. గిరిజన సంక్షేమశాఖ సీఎం వద్దే ఉన్నందున, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మంత్రి తెలిపారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రతీకలుగా నిలవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల వార్డెన్లు, టీచర్లు ప్రత్యేక జాగ్రత్త వహించాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇంటికి పంపించకుండా మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. హాస్టల్ విద్యార్థులు అటవీ ప్రాంతాలకు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. హాస్టల్‌ను తమ సొంత ఇంటిలా విద్యార్థులు భావించేలా చూడాలని, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు తెలిపారు. సరకులు సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

తమ గురుకులంలో వసతులు లేవని, సరైవ భోజనం పెట్టడం లేదని ఇటీవల రంగారెడ్డి జిల్లా పాలమాకుల విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవటం వల్లే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, సరైన సౌకర్యాలు అందటం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థుల వసతులపై దృష్టిసారించింది.

ప్రణాళిక ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతోనే ఈ జల ప్రళయం : మంత్రి సీతక్క - Minister Seethakka Review on Rains

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదా? : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.