Telangana Thalli statue unveiling Ceremony : ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. విగ్రహావిష్కరణకు రావాలని పలువురు ప్రముఖులకు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసి ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆహ్వనపత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
కేసీఆర్‌కు ఆహ్వానపత్రం అందజేసిన మంత్రి పొన్నం : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఆయనతో సుమారు గంట 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకలకు రావాలని కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ ఆహ్వానపత్రం అందజేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు ఉన్నారు.
'తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను, ప్రోటోకాల్ అధికారులము కలిశాము. తెలంగాణలో అందరినీ గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయం. లంచ్ టైంలో వచ్చాము కనుక కేసీఆర్ లంచ్ చేయమంటే చేశాము. మా భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ వస్తారా? రారా అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి పొన్నం : మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. రాజ్ భవన్ దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా రావాలని కిషన్‌రెడ్డికి మంత్రి పొన్నం ఆహ్వానపత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
రాజ్ భవన్ దిల్ కుశా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి
— Ponnam Prabhakar (@Ponnam_INC) December 7, 2024
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది pic.twitter.com/frnHC35enP
తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బహిర్గతం! - పాత, కొత్త విగ్రహాలు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదు : కేటీఆర్