ETV Bharat / state

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ : మంత్రి పొన్నం - MINISTER PONNAM REVIEW MEET

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 4:20 PM IST

Updated : Aug 17, 2024, 4:31 PM IST

Minister Ponnam Review Meet : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించే విధంగా గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరంలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Vinayaka Chavithi Celebrations 2024
Minister Ponnam Review Meeting (ETV Bharat)

Vinayaka Chavithi Celebrations 2024 : గణేష్ ఉత్సవాలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గణేష్ నిమజ్జన ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్, రోడ్లు - భవనాలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

నగర బ్రాండ్ పెంచేలా : ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముంబయి తర్వాత అత్యంత వైభవంగా హైదరాబాద్‌లోనే జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించే విధంగా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు : గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలకు అవసరమైన వాహనాలను సమకూర్చడం, మండపాల వద్ద లైటింగ్ ఏర్పాట్లు, విగ్రహాల తరలింపు సజావుగా సాగేందుకు రోడ్ల నిర్వహణ, పారిశుద్ద్య ఏర్పాట్లు, శాంతిభధ్రతలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించామన్నారు. గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదన్నారు.

ఉత్సవాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని సూచించారు. గణేష్ ఉత్సవాల్లో ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యాన్ని ఆశిస్తుందన్నారు. మండపాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని, అది ఆధిపత్యం మాత్రం కాదని, కేవలం సమాచారం - సమన్వయం కోసం మాత్రమే విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి కోరుతున్నాం అని స్పష్టం చేశారు. మండప నిర్వాహకులు కోర్టు సూచనలు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

"గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముంబయి తర్వాత అత్యంత వైభవంగా హైదరాబాద్‌లోనే జరుగుతాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించే విధంగా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నాము. గణేష్ ఉత్సవాల్లో ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది. ప్రశాంతంగా జరుపుకునేలా అందరూ సహకరించాలి". - పొన్నం ప్రభాకర్, మంత్రి

ఉచిత బస్సు పథకంపై కావాలనే అవహేళన వీడియోల ప్రచారం : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON FREE BUS VIDEOS

'మా పెళ్లై పది సంవత్సరాలవుతోంది - రేషన్​​కార్డు ఎప్పుడిస్తారు సారు?' - Minister Ponnam meet farmers

Last Updated : Aug 17, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.