Minister Ponnam Prabhakar Fires On BRS : మిడ్‌మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని తామంతా కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కానీ తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ముంపు బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Ponnam Comments On Mid Manair : బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు తమ జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి చూశారన్న పొన్నం ఎల్లంపల్లి ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిచేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా వరద కాలువతో సహా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ హాయంలోనే పూర్తయ్యాయని వివరించారు. రెండు టీఎంసీల కోసం ప్రణాళిక వేసినప్పటికీ ఇప్పటివరకూ ఆ నీటిని కూడా వాడలేదని విమర్శించారు. మూడో టీఎంసీ ఎవరికోసమని ప్రశ్నించారు. బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుందని ఎద్దేవా చేశారు.
"బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొంతమంది మా జిల్లాలోని మిడ్‌మానేరు సందర్శనకు వెళ్లారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు వాస్తవానికి రెండు టీఎంసీల కొరకు తీసుకున్న ప్రణాళిక. కానీ దాదాపు రెండువేల కోట్ల నిధులు వృథా అయ్యే విధంగా మూడో టీఎంసీకు పనులు చేస్తున్నారు. ఈ రోజు మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నా. బలహీనవర్గాలకు సంబంధించి మా ప్రభుత్వం హాయంలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాం" - పొన్నం ప్రభాకర్, మంత్రి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అనంతరం కరీంనగర్‌లోని దిగువ మానేరు ప్రాజెక్టును బీఆర్ఎస్ బందం పరిశీలించింది. అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించింది : మంత్రి పొన్నం ప్రభాకర్ - Ponnam comments on BRS
చారిత్రక నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వివక్ష కాదా? : మంత్రి పొన్నం -