ETV Bharat / state

కరీంనగర్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్​ - Ponnam Fires On Bandi Sanjay

Minister Ponnam Prabhakar Fires on Bandi Sanjay : మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలని బండి సంజయ్​ను మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్​ విసిరారు. తన క్యాంపు కార్యాలయంలో గ్యాస్​ సిలిండర్​కు​ దండ వేసి ఇచ్చిన హామీ మేరకు రేపు సబ్సిడీ గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్​ కరీంనగర్​ పార్లమెంట్​ పరిధిలో ఏం చేశారో చెప్పాలని కోరారు.

Ponnam Prabhakar In Siddipet
Minister Ponnam Prabhakar Fires on Bandi Sanjay
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 5:40 PM IST

Minister Ponnam Prabhakar Fires on Bandi Sanjay : మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగి గెలవాలని బండి సంజయ్​పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మడద మహ్మదాపూర్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

అనంతరం మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద గ్యాస్ సిలిండర్​కు(Gas Cylinder)​ దండ వేసి ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

మార్చి నుంచి రూ.500కే గ్యాస్​సిలిండర్,​ గృహజ్యోతి : పొన్నం

"ఫిబ్రవరి 27న చేవెళ్లలో కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు రూ.500 లకే గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మంగళ వారం రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే కానీ, మేము ఇచ్చిన వందరోజుల సమయం పూర్తి కాక ముందే ప్రభుత్వాన్ని కూల్చుతామనే మాటలు మాట్లాడటం తగదు. ​ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించడం సరికాదు."-పొన్నం ప్రభాకర్

రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం : పొన్నం ప్రభాకర్

Minister Ponnam On Congress Schemes : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ (BJP) ప్రజా సంకల్పం, ప్రజా హితం పేరిట యాత్రలు చేస్తోందన్నారు. 48 గంటల వ్యవధిలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ బీమా ప్రకటించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదని అన్నారు. 27న చేవెళ్లలో 500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, కేంద్రం నుంచి 500 రూపాయల రీఫండ్ ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ చెప్పాలని పొన్నం డిమాండ్​ చేశారు.

"ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ బీమా ప్రకటించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. ప్రజాహిత యాత్రలో జనాల ముందుకు వస్తున్న బండి సంజయ్​ సిలిండర్​ ధరను తగ్గించి ఇవ్వగల్గుతారా? బీజేపీ చేపట్టిన యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి. మత పరమైన అంశాల మీద ఓట్లు అడగటం సమజసం కాదు. బండి సంజయ్​, బీజేపీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి?"-పొన్నం ప్రభాకర్, మంత్రి

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్​

'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'

వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.