ETV Bharat / state

కరువు అనేది ప్రకృతి రాజకీయ పార్టీలను అనడం సరికాదు : పొన్నం ప్రభాకర్​ - Ponnam Prabhakar Latest Comments

Minister Ponnam Prabhakar on Water Problem in Telangana : రాష్ట్రంలో నీటి కరువు కాంగ్రెస్​ వల్లనే అంటూ విమర్శించడం మూర్ఖత్వానికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ప్రకృతికి సంబంధించిన అంశాలను పార్టీలపై వేయడం సరికాదన్నారు.

Ponnam Comments On BRS
Minister Ponnam Prabhakar on Water Problem in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 3:14 PM IST

Minister Ponnam Prabhakar on Water Problem in Telangana : దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే దాన్ని కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. సంకుచిత మనస్తత్వంతో ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలతో పాటు కొత్తపల్లిలో మెడికల్​ కాలేజీ భననానికి, ఉప్పరి మల్యాలలో సబ్స్​ స్టేషన్​కు శంకుస్థాపన చేశారు. విద్యార్థులు వ్యవసాయ రంగంలో కొత్త మెలకువలు నేర్చుకుని రైతులకు అదనపు ఆదాయం వచ్చే విధంగా శిక్షణ పొందాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

Ponnam Comments On BRS : దేశవ్యాప్తంగా తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేసినా ఆ అంశాన్ని కూడా కొంతమంది నాయకలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు (Water Problem In Telangana) కాంగ్రెస్ వల్లనే వచ్చిందని ముఖ్యమంత్రి స్థాయిలో పని చేసిన నాయకులు కూడా విమర్శించడం మూర్ఖత్వానికి నిదర్శనమని పొన్నం దుయ్యబట్టారు. సెప్టెంబర్​లో వర్షాలు కురవాల్సి ఉండగా కురవలేదని ఆ సమయంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం (BRS Past Ruling) ఉందని దానికి కారణం వారేనని తాము నిందించడం లేదని ఆయన పేర్కొన్నారు. కరువు అనేది ప్రకృతి, వర్షాలు పడకపోవడం వల్ల వస్తుందని అన్నారు. దానికి ఇతరులను విమర్శించడం సరికాదన్నారు.

'జీవో 317, 46 సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించండి'

"ఉప్పర మల్యాల సబ్​ స్టేషన్​కు శంఖుస్థాపన చేశాం. దీని ద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన విద్యుత్​ అందుతుంది. గత పది సంవత్సరాలు ఈ పనిలో ఎలాంటి పురోగతి లేదు. అప్పటి కాంగ్రెస్​ హయాంలో మొదలైంది అదే ప్రభుత్వం మళ్లీ వచ్చింది. దీన్ని తొందరగా పూర్తి చేయమని చెప్పాను. కాంగ్రెస్​ కరువు తీసుకువచ్చిందని అన్న వారందరికి చెప్తున్నా ఎందుకంటే సెప్టెంబరులో వర్షాలు పడలేదు. అప్పుడు బీఆర్​ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు దానికి కూడా వారు బాధ్యులు అంటలేము. కరువు అనేది వర్షాలు పడకపోవడం వల్ల వస్తుంది అది ప్రకృతి ఏదో రాజకీయ పార్టీతో రాదు. అలా అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్న." - పొన్నం ప్రభాకర్​, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

కరువు అనేది ప్రకృతి రాజకీయ పార్టీలను అనడం సరికాదు : పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా : మంత్రి పొన్నం

నీటి సమస్యను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అయితే డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేయలేమన్న ఆయన అందుకు బదులుగా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఎవరైన ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత ప్రతి అంశాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని చూడడం దారుణం అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : పొన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.