Minister Ponguleti on Rationcards : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రూ.31వేల కోట్లతో ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆయన తెలిపారు. ఇవాళ తన నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లిలో పర్యటించారు. ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఆచార్య జయశంకర్‌కు నివాళులు అర్పించిన రాజకీయ నేతలు - CM revanth tribute to jayashankar
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడిందని పొంగులేటి పేర్కొన్నారు. త్వరలో పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కొద్దిరోజుల్లో ప్రభుత్వం అన్ని సమస్యలను తీరుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు స్పందించి గ్రామాల్లో పనిచేయడం లేదని, ఎన్ఎస్పీ భూములు ఆక్రమణకు గురి అయితే అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులపై స్పందించారు.
ప్రజాసమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వ ఉపేక్షించబోదని హెచ్చరించారు. అధికారులంతా సక్రమంగా పనిచేయాలని, కబ్జాకు గురైన వాటన్నిటిని బయటకు తీసి పేదోడికి అప్పజెప్పాలని ఆయన సూచించారు. ఇకనైనా ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
"ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రూ.31వేల కోట్లతో ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాము. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడింది. త్వరలో పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాము. ప్రజాసమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వ ఉపేక్షించబోదు. అధికారులంతా సక్రమంగా పనిచేయాలి". - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి
ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti on Dharani