ETV Bharat / state

ధరణితో సరికొత్త విప్లవం అన్నారు - కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు : మంత్రి పొంగులేటి - DHARANI PORTAL ISSUE IN TG ASSEMBLY - DHARANI PORTAL ISSUE IN TG ASSEMBLY

Minister Ponguleti Comments on Dharani : భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పి ధరణి పోర్టల్ తీసుకువచ్చారని దాని వల్ల ఎక్కడ చూసినా సమస్యలే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడి అధికారులు చుట్టు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

Minister Ponguleti Srinivas Reddy on Dharani Portal
Minister Ponguleti Srinivas Reddy on Dharani Portal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 2:12 PM IST

Updated : Aug 2, 2024, 4:14 PM IST

Minister Ponguleti Srinivas Reddy on Dharani Portal : గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పి తీసుకొచ్చిన ఈ పోర్టల్​ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేదరైతులు చెప్పలరిగేలా అధికారుల చుట్టూ తిరిగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సాదాబైనామాల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్న ఆయన ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.

ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారిస్తాం: భట్టి విక్రమార్క - Dy CM Bhatti Vikramarka On Dharani

అందుకే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు : ధరణి పోర్టల్‌ నిర్వహణను డీఫాల్డ్ అయిన సింగపూర్‌ కంపెనీకి అప్పగించారన్న పొంగులేటి ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పామని అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని తెలిపారు. భూసంస్కరణల డ్రాఫ్ట్ చట్టాన్ని మూడువారాల్లో వెబ్‌సైట్‌లో పెడతామని వెల్లడించారు. డ్రాఫ్ట్ చట్టంపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మంచిచేసే ప్రతి సూచననూ స్వీకరిస్తామని చెప్పారు.

ధరణి పేరుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భూసమస్యలపై వచ్చిన అన్ని దరఖాస్తులనూ పరిశీలిస్తామని వెల్లడించారు. దరఖాస్తు తిరస్కరిస్తే కారణం రాయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అంతా తమకే తెలుసు అనేలా తాము ప్రవర్తించమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం ప్రజలు సులభతరంగా సేవలు పొందడమేనని చెప్పారు.

"ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని బడుగువర్గాలకు రూ.40 కోట్ల ఎకరాలు పంచారు. ధరణిపై ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాం. 18 రాష్ట్రాల్లోని చట్టాలు అధ్యయనం చేశాం. దేశానికి రోల్‌ మోడల్‌గా ఉండే డ్రాఫ్ట్ చట్టం తయారుచేశాం. ధరణి చట్టంతో ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారు. గత ప్రభుత్వం పేదల ఆస్తులను లాక్కుని దొరలకు కట్టబెట్టింది. ధరణి పేరుతో సామాన్యులకు చెందిన లక్షల ఎకరాలు మాయం చేశారు. ధరణి చట్టం పేరుతో నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తాం." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి

ప్రపంచ చరిత్రంలో భూదాన ఉద్యమం భారత దేశంలోనే పుట్టిందని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. భూసంస్కరణల శ్రీకారం చుట్టింది ఇందిరా గాంధీ అని తెలిపారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భూసంస్కరణలు చేపట్టారని వివరించారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి పేదలకు భూములు పంచిందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ హయాంలో పోడుభూములకు పట్టాలు ఇచ్చారని ప్రజలకు మంచి చేసిన వారి పేర్లు ప్రస్తావించడం సముచితమన్నారు.

'ధరణి'పై మరింత లోతుగా అధ్యయనం చేయండి - శాశ్వత పరిష్కారం చూపండి : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Review On Dharani Portal

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పేదల కలలు కలలుగానే మిగిలాయి : మంత్రి పొంగులేటి - Ponguleti Comments on Activists

Last Updated : Aug 2, 2024, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.