ETV Bharat / state

ఇందిరమ్మ రాజ్యం మీద బంజారాలకు అత్యంత నమ్మకం, విశ్వాసం : మంత్రి పొంగులేటి - సేవాలాల్ జయంతి వేడుకల్లో పొంగులేటి

Minister Ponguleti At Sevalal jayanti Sabha : గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బంజారాలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని, ఇందిరమ్మ రాజ్యం మీద బంజారాలకు నమ్మకం, విశ్వాసం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని బంజారా భవన్ స్థలంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొనడంతో గిరిజనులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Sevalal jayanti Sabha
Minister Ponguleti At Sevalal jayanti Sabha
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 4:46 PM IST

Updated : Feb 19, 2024, 5:38 PM IST

Minister Ponguleti At Sevalal jayanti Sabha : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని బంజారా భవన్ స్థలంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు గిరిజనులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హింస, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని సంత్ సేవాలాల్ సూచించారన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని, ఇందిరమ్మ రాజ్యం మీద బంజారాలకు నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యానికి, బంజారాలకు ఉన్న బంధం పెవికల్ లాంటిదని అన్నారు.

ఈ నెల 15న గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల్గొని సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిపారు.

మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొంగులేటి

బంజారాలను ఎస్టీలో చేర్చింది ఇందిరా గాంధీ అని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు మాత్రమే అయ్యిందని, ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని, మరో రెండు అమలు కాబోతున్నాయని, ఇచ్చిన గ్యారెంటీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని, ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.

"హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌ సభలో మీ అందరి సమక్షంలో చాలా అద్భుతంగా ఈ జయంతిని జరుపుకున్నాం. ఏ కులమైనా, ఏ మతమైనా ఆయనను ఒక్కసారి గర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆకలితో ఉన్న వారి కడుపు నింపిన తర్వాత తన కడుపును నింపుకునేవారు. ఇలాంటి సేవల కార్యక్రమాలు ఎన్నో చేసి పేదల కడుపు నింపాడు కాబట్టి దేవుడయ్యాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది." -మంత్రి పొంగులేటి

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15న (గురువారం) ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాసేపట్లో దిల్లీకి రేవంత్‌రెడ్డి - నామినేటెడ్‌ పోస్టులపై అధిష్ఠానంతో చర్చించనున్న సీఎం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

Last Updated : Feb 19, 2024, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.