ETV Bharat / state

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటున్న నారా లోకేశ్ - ప్రజాదర్బార్‌కు పోటెత్తిన జనం - Minister Nara Lokesh Praja Darbar - MINISTER NARA LOKESH PRAJA DARBAR

Minister Nara Lokesh Praja Darbar: మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని నాలుగేళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని, తగిన న్యాయం చేయాలని తాళ్ల నాగరాజు అనే వ్యక్తి కన్నీటిపర్యంతమయ్యారు. సమస్యను విన్న లోకేశ్, తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓ మహిళ లోకేశ్​కు విజ్ఞప్తి చేశారు. అందరి సమస్యలను విన్న లోకేశ్, వాటి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.

Minister Nara Lokesh Praja Darbar
Minister Nara Lokesh Praja Darbar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 12:56 PM IST

Minister Nara Lokesh Praja Darbar: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 18వ రోజు “ప్రజాదర్బార్”లో ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి, వారి నుంచి విన్నపాలు స్వీకరించారు.

ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ నందిగం సురేష్​కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని నాలుగేళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన తాళ్ల నాగరాజు లోకేశ్​ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల నుంచి తన మనవడిని ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా ఉండవల్లి సెంటర్ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, ప్రమాదంలో తన కాలు విరిగిందని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగం సురేష్ పేరు చెప్పి డ్రైవర్ బెదిరించాడని వాపోయారు. విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న లోకేశ్ పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar

తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన భవనాశి రాజరాజేశ్వరి నారా లోకేశ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో మట్టి రోడ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలంలో మరీ అధ్వానంగా మారాయని, సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామ సర్పంచ్ యలవర్తి అంకమయ్య కోరారు. పుట్టకతోటే రెండు కిడ్నీలు పాడైపోయిన తమ కుమారుడికి వైద్యం సాయం అందించి ఆదుకోవాలని మంగళగిరి పట్టణానికి చెందిన తాళ్లూరి శిరీష విజ్ఞప్తి చేశారు.

ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సీతానగరానికి చెందిన ఎన్.సూరిబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన 8 నెలల కుమారుడికి వైద్యం సాయం చేయాలని తాడేపల్లికి చెందిన పఠాన్ అల్లాబీ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్​గా పనిచేస్తున్న తనకు పిల్లల చదువు భారంగా మారిందని, రేషన్ కార్డు మంజూరు చేయాలని కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన వి.విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పెదకాకాని మండలం నంబూరులో తమ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడకు చెందిన ఎస్.నరేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు.

ఒక్క మెసేజ్‌ పెడితే, వెంటనే స్పందిస్తా - యువతకు మంత్రి లోకేశ్‌ భరోసా - Specially Abled Students Met Lokesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.