Minister Nara Lokesh Praja Darbar: గత ప్రభుత్వం తొలగించిన అర్హుల రేషన్ కార్డులు, పెన్షన్లను పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్‌గా పేరొందిన కొడాలి నాని ఆగడాలతో తీవ్రంగా నష్టపోయామని, సదరు గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు.
15వ రోజు నారా లోకేశ్ 'ప్రజాదర్బార్'కు విన్నపాలు వెల్లువెత్తాయి. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అన్యాక్రాంతమైన తమ భూముల సమస్యలు పరిష్కరించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ కాలపరిమితి ముగిసినందున తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మంగళగిరి 6వ బెటాలియన్ సిబ్బంది కోరారు. సీపీఎస్ విధానం అమలు తేదీ కంటే ముందే నియామకపత్రాలు పొందిన తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని 2003 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లు విన్నవించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. బీ-ఫార్మసీ అభ్యర్థులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు విజ్ఞప్తిచేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన మంత్రి లోకేశ్.. వాటి పరిష్కరానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ - నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar