Minister Konda Surekha Review On Forest Fire Accidents : అటవీ స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ (PD Act) పెట్టాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సూచించారు. దీనికోసం పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని చెప్పారు. వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా అటవీ శివారుల్లో “పల్లె పశువుల వనాల” ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు.
సమావేశంలో స్థానిక జాతులు, చెట్లు, విత్తనాలు సేకరించడంపై విస్తృతంగా చర్చించారు. స్థానిక జాతులు చెట్ల విత్తనాలు సేకరించి, మెరుగైన మొక్కలు నర్సరీల్లో పెంచాలని ఆదేశించారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచటం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయని తెలిపారు. వచ్చే సీజన్‌పై జిల్లా సమీక్షా సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అడవుల ఆక్రమణ సహించమన్న మంత్రి కొండా సురేఖ గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వన్యప్రాణులను వేట కోసం నాటు బాంబులు, తుపాకులు - సీజ్ చేసిన అధికారులు
Minister Review With Forestry Department : ఇటీవల కాగజ్‌నగర్‌లో పులుల మరణం తనను కలిచివేసిందని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకూడదని ఆదేశించారు. అడవుల ఆక్రమణ సహించమని, గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇందుకోసం ఇతర శాఖల మద్ధతు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉన్న దృష్ట్యా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడవులకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Minister konda Surekha Launched Honey Wild Flavors : పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ది చేసిన తేనె “వైల్డ్ ఫ్లేవర్స్” (Honey Wild Flavors) బ్రాండ్ పేరిట ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ఎఫ్‌సీఆర్‌ఐ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన సేంద్రీయ తేనెను మంత్రి (Minister konda Surekha) ఆవిష్కరించారు. ఈ సేంద్రీయ తేనె ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రం నెలకొల్పామని తెలిపారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు ఈ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలపై వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు అందిస్తుందని మంత్రి సురేఖ చెప్పారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై విమర్శలు సరికాదు: కొండా సురేఖ
లిక్కర్ కేసులో బీజేపీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? : మంత్రి కొండా సురేఖ