ETV Bharat / state

బహిరంగంగా నోటికొచ్చినట్లు మాట్లాడి - 'ఎక్స్​'లో సారీ అంటే ఎలా? - కేటీఆర్​పై కొండా సురేఖ ఫైర్ - Minister Konda Surekha fires on KTR - MINISTER KONDA SUREKHA FIRES ON KTR

Minister Konda Surekha fires on KTR : ప్రజలు అధికారాన్ని దూరం చేసినప్పటికీ, బీఆర్ఎస్‌ నాయకులకు అహంకారం తగ్గలేదని దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ విమర్శించారు. మహిళలను ఉద్దేశించి బస్సులో బ్రేక్‌ డ్యాన్సులంటూ మాట్లాడి, ఎక్స్‌లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన ప్రాయశ్చితం కాదని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

Konda Surekha reacts on KTR Comments
Minister Konda Surekha fires on KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 10:19 PM IST

Updated : Aug 16, 2024, 10:29 PM IST

Konda Surekha reacts on KTR Comments : మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడి, యథాలాపంగా చేసిన వ్యాఖ్యాలంటూ విచారం వ్యక్తం చేసినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని బీఆర్ఎస్‌ నేత కేటీఆర్‌పై రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ను చదువుకున్న వాళ్లు మాత్రమే అనుసరిస్తారని, బహిరంగంగా గ్రామీణ మహిళలపై వ్యాఖ్యలు చేసి చాటుగా క్షమాపణలు చెప్పడమేంటని ఆమె ప్రశ్నించారు.

ముక్కు నేలకు రాయాలి : మహిళలపై వ్యాఖ్యలకు ప్రాయశ్చితంగా కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసిన చరిత్ర కేటీఆర్‌కు ఉండొచ్చు కానీ, మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇంకా అహంకారం తగ్గలేదు : ప్రజలు అధికారాన్ని దూరం చేసినప్పటికీ బీఆర్ఎస్‌ నాయకులకు అహంకారం తగ్గలేదని మంత్రి కొండా సురేఖ దుయ్యబట్టారు. మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం పట్ల బీఆర్ఎస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై బీఆర్ఎస్‌ చూపుతున్న ప్రేమ, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతాంగానికి చేసిందేమీ లేదని, రుణమాఫీ, పంట నష్ట పరిహారాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి మోసం చేసిందని కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ అమలు చేసి చూపించిందన్నారు. అసెంబ్లీలో మహిళలను అవమానించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై, బీఆర్ఎస్ చేసిన కుట్ర వికటించిందని మంత్రి సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, బీఆర్ఎస్‌ కుట్రలను ఛేదించి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారని మంత్రి పేర్కొన్నారు.

"మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడి, యథాలాపంగా చేసిన వ్యాఖ్యాలంటూ ట్వీట్‌ చేస్తూ విచారం వ్యక్తం చేసినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు. ట్విటర్‌ను చదువుకున్న వాళ్లు మాత్రమే అనుసరిస్తారు. కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలి". - కొండా సురేఖ, మంత్రి

వరంగల్ జిల్లాను ఎకో, టెంపుల్​ టూరిజంగా తీర్చిదిద్దుతాం : కొండా సురేఖ - Konda Surekha on Warangal temples

మంత్రి కొండా సురేఖతో రేణు దేశాయి భేటీ - ఎందుకంటే?

Last Updated : Aug 16, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.