ETV Bharat / state

లోటు బడ్జెట్​లో ఉన్నా - ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి - Chityala NH 65 flyover BHOOMI PUJA

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 2:48 PM IST

NH 65 flyover at Chityala : బీఆర్​ఎస్​ పదేళ్లలో చేయని అభివృద్ధి కాంగ్రెస్​ ఆరు నెలల్లో చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న ఎన్​హెచ్​ 65 ఫ్లైఓవర్​కు శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి భూమి పూజ చేశారు.

NH 65 flyover at Chityala
NH 65 flyover at Chityala (ETV Bharat)

Bhoomi Puja for NH 65 Flyover at Chityala : లోటు బడ్జెట్​లో ఉన్నా, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆర్​అండ్ ​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల వద్ద ఉన్న ఎన్​హెచ్​ 65 ఫ్లైఓవర్​కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీపై విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మాట్లాడుతూ బీఆర్​ఎస్​ పదేళ్లలో చేయని అభివృద్ధి, కాంగ్రెస్​ ఆరు నెలల్లో చేసిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రూ.వేల కోట్లు దోచుకుని గత ప్రభుత్వం కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్​హెచ్​ 65పై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్​ స్పాట్​లను గుర్తించామని తెలిపారు. ఈ బ్లాక్​ స్పాట్​ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చిట్యాల వద్ద రూ.40 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్​ నిర్మాణం చేపట్టామని వివరించారు. మరోవైపు చౌటుప్పల్​ వద్ద రూ.140 కోట్ల వ్యయంతో మరో ఫ్లై ఓవర్​ నిర్మించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్​లోపు ఎన్​హెచ్​ 65 ఆరు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లతో రీజినల్​ రింగ్​ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.

అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : తనకు నల్గొండ, నకిరేకల్​ రెండు రెండు కళ్లలాంటివని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్​లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టును రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. ఈ విధంగా చేస్తూ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చిందని ఆవేదన చెందారు. లోటు బడ్జెట్​లో ఉన్నా, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.

రోడ్లు, ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - Minister Komatireddy on Road Works

ఎస్ఎల్​బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.