MINISTER KOLLU RAVINDRA ON EXCISE POLICY : గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తైందని, తదుపరి సీబీసీఐడీ (Crime Branch, Crime Investigation Department) విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో డిస్టలరీల పేరిట లక్షల కోట్ల దోపిడీ జరిగిందన్నారు. కల్తీ మద్యం వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కారణమైందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. అక్రమార్కులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో నూతన మద్యం విధానం అనుసరించి మద్యం ధరలను తగ్గించామని, నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నామన్నారు. రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు.
వైఎస్సార్సీపీ వారికీ మద్యం దుకాణాలు వచ్చాయి: కూటమి ప్రభుత్వంలో మద్యం దుకాణాలను ఎక్కడా పెంచలేదన్నారు. 99 రూపాయల చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా అందుబాటులో పెడతామన్నారు. పక్కరాష్ట్రం కంటే ఇక్కడ ధర తక్కువే ఉండేలా టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను పెంచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్న కొల్లు రవీంద్ర, గతంలో ఉన్న ఉన్న 3396 షాపులకే టెండర్లు పిలిచామని, వీటిలో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయించినట్లు తెలిపారు. పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించామని అన్నారు. దీనివల్ల 1800 కోట్లు ప్రభుత్వానికి వచ్చిందన్న మంత్రి, లాటరీల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించడంతో వైఎస్సార్సీపీ వారికి కూడా మద్యం దుకాణాలు వచ్చాయన్నారు.
Kollu Ravindra on CBCID Enquiry : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో మైనింగ్ అవకతవకల ద్వారా ప్రభుత్వానికి 19 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పర్మిట్లకు అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు సహజ సంపదను తవ్వుకుని కోట్లు కొల్లగొట్టారన్నారు. మైనింగ్ కార్యకలాపాల్లో అవకతవకలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరుగుతోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త శ్యాండ్ పాలసీలో భాగంగా ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెలిపారు.
'రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'