ETV Bharat / state

లైట్ అండ్ సౌండ్ షోతో కొత్త అందాలతో వెలిగిపోతున్న గోల్కొండ కోట - Chiranjeevi on Light and Sound show

Minister Kishan Reddy Launch Golconda Light and Sound Show : హైదరాబాద్‌లోని గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కళకళలాడుతోంది. కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సినీనటుడు చిరంజీవి, సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Light and Sound show at Golconda
Golconda light and Sound Show
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 10:50 PM IST

Updated : Jan 24, 2024, 11:01 PM IST

Minister Kishan Reddy launch Golconda light and Sound Show : ఆధ్యాత్మికత, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భాగ్యనగరాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారించాలని కిషన్​రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇవాళ గోల్కొండ కోటలో ఎల్యుమినేషన్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

గోల్కొండ చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా 30 నిమిషాల 20 సెకండ్ల నిడివిగల వీడియోను మాజీ కేంద్ర మంత్రి, సినీనటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం గోల్కొండ కోటపై దానిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కాకతీయ వంశంలో నిర్మించిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్​లోని వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరంగల్​ పోర్టులో కూడా లైట్​ అండ్​ షో ఏర్పాట్లపై పనులు జరుగుతున్నాయని, త్వరలో అది కూడా ప్రారంభం కానుంది చెప్పారు.

'భవిష్యత్​ తరాల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. త్వరలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదేవిధంగా వరంగల్​లోనే కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్​లో ఆర్ట్స్​ కళాశాలలో కూడా లైట్ అండ్​ సౌండ్​ షో ఏర్పాటు చేస్తున్నాం. ఈ నాలుగైదు రోజుల్లో అది కూడా ప్రారంభం కానుంది' - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

Chiranjeevi on Light and Sound show at Golconda : ఈ నేపథ్యంలో సినీనటుడు చిరంజీవి తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. గోల్కొండతో తనకు ఆత్మీయ గుర్తులు ఉన్నాయని, పలు సినిమాలు చేసే సమయంలోని స్మృతులను గుర్తు చేసుకున్నారు. భారతదేశ వైవిధ్యతను ప్రపంచానికి చాటి చెప్పే టూరిజం మరింత పెరగాల్సి ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దేశమంతా రామమయం అయిపోయిన సందర్భంలో గోల్కొండపై ఈ దృశ్యం ఆవిష్కృతం అవ్వడం సంతోషంగా ఉందని సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

'ఛత్రపతి శివాజీ లాంటి వారే గోల్కొండ కోటకు వచ్చి వీక్షించారంటే దీని గొప్పతనం ఇక్కడే అర్థమౌతుంది. దేశంలో కేరళ అనేది పర్యాటక ప్రాంతంగా నెంబర్​ వన్​ స్థానంలో ఉండేది. అలా మరిన్ని పర్యాటక కేంద్రాలు అభివృద్ధి కావాలి' - చిరంజీవి, కేంద్ర మాజీమంత్రి, సినీ నటుడు

లైట్ అండ్ సౌండ్ షోతో కళకళాడుతున్న గోల్కొండ కోట

గోల్కొండ కోటలో సౌండ్ అండ్‌ లైట్ షో

15 రోజుల్లో అనంతగిరి పర్యాటక కేంద్రంలో రూ.100 కోట్ల పనులు : కిషన్​ రెడ్డి

Last Updated : Jan 24, 2024, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.