Minister Dola Veeranjaneyaswamy Review of Various Departments in Ongole: అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వివిధ శాఖల వారిగా మంత్రి అధ్యక్షతన తొలిసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ శ్రీనివాసుల రెడ్డి (MP Srinivasula Reddy) పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడారు. శాఖల వారీగా సమీక్ష జరిగి చాలా కాలం అయిందని అన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఎళ్లు అయిందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు.
ప్రధానంగా తాగునీటి సమస్యలపై శాసన సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒంగోలు పట్టణంలో తాగునీటి సరఫరా బాగోలేదని, పెర్ణమెట్ట వద్ద రిపేర్లు చేయాల్సి అన్నా పట్టించుకోవడం లేదన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో నీళ్ల ట్యాంక్‌లు పేరుతో నకిలీ బిల్లులు పెట్టీ రూ. 4 కోట్లు వరకు నిధులు దుర్వినియోగ పరిచారని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు మెరుగుపరచాలని, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
వాలంటీర్లు రివర్స్ - వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు - Volunteers Filed Police Case on YCP
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశం: వెలుగొండ ప్రాజెక్ట్‌పై సమీక్షిస్తూ ఒకటవ టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి చేయడానికి మరో మూడు నెలలు పూర్తి అవుతుందని, రెండో టన్నెల్ పనులు ఇంకా పూర్తి కాలేదని, ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని వెలుగొండ ఇంజిరింగ్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వం ప్రజలను తప్పు దోవ పాటించే విధంగా ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి అని ప్రారంభోత్సవాలు నిర్వహించారని, ఇది హాస్యాస్పదమని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని మంత్రి సూచించారు. తాగునీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు.