ETV Bharat / state

'ప్ర‌జ‌ల‌కు వైద్య‌ సేవ‌లు అందించ‌డంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాలు రెండూ కీల‌క‌ పాత్ర పోషించాలి' - Euderm Hair and Skin Clinic - EUDERM HAIR AND SKIN CLINIC

Minister Rajanarsimha Inagurates Euderm Clinic : ప్ర‌జ‌ల‌కు వైద్య‌ సేవ‌లు అందించ‌డంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాలు రెండూ కీల‌క‌ పాత్ర పోషించాల‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌ శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ పేర్కొన్నారు. ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రైవేటు రంగం మ‌రింత బాధ్యతాయుతంగా వైద్య‌ సేవ‌లు అందించాల‌ని ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింన‌గ‌ర్‌లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖ‌ను ఆదివారం ఆయ‌న ప్రారంభించారు.

Euderm Hair and Skin Clinic Hyderabad
Minister Rajanarsimha Inagurates Euderm Clinic (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 4:05 PM IST

Euderm Hair and Skin Clinic Hyderabad : ప్రజలకు ప్రైవేటు రంగం మ‌రింత బాధ్యతాయుతంగా వైద్య‌ సేవ‌లు అందించాల‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌ శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. ప్రజావైద్యంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాలు రెండూ కీల‌క‌పాత్ర పోషించాల‌ని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఫిలింన‌గ‌ర్‌లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖ‌ను ఆదివారం ఆయ‌న ప్రారంభించి ప్ర‌సంగించారు.

ఇటీవ‌ల కాలంలో చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ జుట్టు రాల‌డం, ఇత‌ర చ‌ర్మ సంబంధిత ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని రాజనర్సింహ పేర్కొన్నారు. వాటన్నింటికీ స‌మ‌గ్రంగా వైద్య‌ సేవలు అందించ‌డానికి వీలుగా ఒకేచోట అన్నిర‌కాల వైద్యం చేసేందుకు, యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించ‌డం ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. డాక్ట‌ర్ సృశాంత్ లాంటి యువ‌కులు ఈ రంగంలో అత్యాధునిక ప‌ద్ధ‌తులు పాటిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌మ‌వంతు సేవ‌లు అందించాల‌ని సూచించారు.

Euderm Hair and Skin Clinic Hyderabad
జూబ్లీహిల్స్‌లో యూడెర్మ్‌ క్లినిక్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ (ETV Bharat)

అన్ని రకాల వైద్యసేవలు లభ్యం : ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా డాక్ట‌ర్ సృశాంత్ ముక్కా మాట్లాడారు. తాము ఇప్ప‌టికే కోకాపేట‌లో ఒక ఆస్ప‌త్రి నిర్వ‌హిస్తున్నామని, ఇప్పుడు న‌గ‌ర‌వాసుల‌కు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగ‌ణంలో ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్క‌డ అన్నిర‌కాల చ‌ర్మ‌, శ‌రీర‌, జుట్టు స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన వైద్యులు, మ‌హిళా వైద్యులు, కాస్మోటాల‌జిస్టులు, డెర్మ‌టాల‌జిస్టులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు.

సాధార‌ణ చ‌ర్మ‌ సంబంధిత ఇన్ఫెక్ష‌న్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర స‌మ‌స్య‌ల వ‌ర‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జుట్టు రాల‌డం, పూర్తిగా ఊడిపోవ‌డం లాంటి తీవ్ర‌మైన ఇబ్బందుల వ‌ర‌కు అన్నింటికీ చికిత్స‌లు ఇస్తున్నట్లు తెలిపారు. కాస్మోటిక్ చికిత్స‌లు కూడా ఇక్క‌డ అందించ‌గ‌లమని, శ‌రీరంలోని గుప్త‌ భాగాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, ఇన్ఫెక్ష‌న్లు ఉన్నా, వాటికి సైతం స‌మ‌ర్థ‌వంతంగా చికిత్స‌లు చేయ‌గ‌ల స‌దుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గ‌తంలో 50-60 ఏళ్లు దాటిన త‌ర్వాతే జుట్టు రాల‌డం, ఊడిపోవ‌డం, బ‌ట్ట‌త‌ల ఏర్ప‌డ‌టం లాంటి స‌మ‌స్య‌లు ఉండేవని, కానీ ఇప్పుడ‌వి 18-20 ఏళ్ల వ‌య‌సులో కూడా వ‌స్తున్నాయన్నారు. దీనివ‌ల్ల చాలా మంది యువ‌తీ యువ‌కులు ఇబ్బంది ప‌డుతూ కాలేజీల‌కు వెళ్ల‌డం కూడా మానుకుంటున్నారని, ఇలాంటి వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ లాంటి చికిత్స‌లు చేస్తున్నట్లు తెలిపారు.

ఎంబీబీఎస్‌ ప్రవేశాల జీవోపై మంత్రి రాజనర్సింహ క్లారిటీ - ఎక్స్​ వేదికగా కేటీఆర్​ విమర్శలకు చెక్​ - Rajanarsimha Clarity On MBBS Seats

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం - అసలైన ఆట ఇప్పుడే మొదలైంది : మంత్రి రాజనర్సింహ - RAJANARSIMHA ON SC CLASSIFICATION

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.