Mini Medaram Jatara In Hanmakonda : అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ జాతరకు ఎంతో చరిత్ర ఉందని కోరి కొలిస్తే కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ మేడారం కంటే ముందు ఇక్కడే కొలువయ్యారని అక్కడ ప్రజలు తెలుపుతున్నారు. ఇక్కడ అభయారణ్యం లేకపోవడంతో అమ్మవార్లు మేడారంకు తరలి వెళ్లారని తమ పూర్వీకులు చెప్తారని తాము వంశపారపర్యంగా అమ్మవార్లను కోలుస్తున్నామని ప్రస్తుత జాతర పూజారులు చెప్తున్నారు. కోరుకున్న కోరికలను తీర్చే అత్యంత మహిమగల జాతర, ఉద్యోగ వ్యాపార రీత్యా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం అగ్రంపహాడుకు వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. జాతర సమీపిస్తుండడంతో 20 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు, ఈ జాతరను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగురోజుల్లో మినీ మేడారం జాతర... పనుల్లో నిమగ్నమైన అధికారులు
"ఈ జాతర మా తాత, తండ్రుల నుంచి వారసత్వంగా జరుపుకుంటున్నాం. మొదట అమ్మవారు అగ్రంపాడులోనే వెలిశారు. ఈ ఊరికి రాఘవపురం అని పేరు. సమ్మక్క సారలమ్మ జన్మస్థానం ఇక్కడే వేలిశారని ప్రతీతి. సుమారు 30 లక్షల జనాభా ఇక్కడికి వచ్చి దేవతను దర్శించుకుంటారు. మేడారం దర్శించుకున్న వారు సైతం ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది."-వెంకటేశ్వర్లు, సారలమ్మ పూజారి
Sammakka Saralamma Mini Jatara In Agrampadu : కాకతీయుల కాలం నుంచే ఈ జాతర కొనసాగుతుందని గతంలో రాఘవపురం పేరుతో జాతర కొనసాగేదని కాలక్రమమైన అగ్రంపహాడు గ్రామపంచాయతీ కావడంతో ఆ పేరు మీదే కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి జాతరకు సుమారు 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని మేడారం వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ జాతరను దర్శించుకుంటారన్నారు. కానీ ఉండడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి భక్తులు ఉండడానికి తగిన ఏర్పాట్లను చేస్తే జాతర ఇంకా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి నిధులు కేటాయించి శాశ్వత అభివృద్ధి పనుల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు.
జనం నుంచి వనం చేరిన సమ్మక్క సారలమ్మలు
"మినీ మేడారంకు ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కోరిన కోరికలు తీరుతాయిని మా నమ్మకం అందుకే మేడారం దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంటాం. ఈ ప్రశాంత వాతావరణంతో ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కోలుస్తాం. కాకతీయుల కాలం నుంచి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది. జాతర జరిగే సమయంలో 80 లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు."-భక్తులు