ETV Bharat / state

మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే - మంత్రి ఉత్తమ్‌కు విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక - మేడిగడ్డ బ్యారేజీ సమస్య

Medigadda Barrage Damage Issue Updates : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలు ఉన్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్‌ ఏది అడిగితే ఇంజినీరు అది ఇచ్చేశారని నిర్ధారించారు. ఆనకట్ట ప్రారంభించిన రెండేళ్ల తర్వాత అంచనా విలువను రూ.1,353 కోట్ల పెంచినట్లు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్‌ రెడ్డికి విజిలెన్స్‌ అధికారులు ప్రాధమిక నివేదికను సమర్పించినట్లు సమాచారం.

Vigilance Inquiry on Medigadda
Medigadda Barrage Damage Issue Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 8:52 AM IST

Updated : Feb 4, 2024, 9:51 AM IST

మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే మంత్రి ఉత్తమ్‌కు విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక

Medigadda Barrage Damage Issue Updates : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలే ఉన్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. యజమాని ప్రభుత్వం కాదు, గుత్తేదారు అన్నట్లుగా ఇంజినీర్లు వ్యవహరించినట్లు గుర్తించారు. 2019లో ఆనకట్టను ప్రారంభించిన నాలుగు నెలలకే సమస్యలు తలెత్తాయి. ఐదేళ్లుగా నిర్వహణా సక్రమంగా లేదని బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొంది. ఈ మేరకు విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ ప్రాథమిక నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి అందించినట్లు తెలిసింది. మేడిగడ్డ నిర్మాణం పూర్తై ప్రారంభించిన రెండేళ్ల తర్వాత అంచనా విలువ రూ.1,353 కోట్లు పెంచడం సహా ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్‌ ఏది అడిగితే అది ఇచ్చారని నిర్ధారించారు.

Vigilance Inquiry on Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్​ పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్‌ మొదలు, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలు ఉన్నట్లు నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు. ఆనకట్ట నిర్మాణ గడువు ఆరుసార్లు పొడగించడం సహా బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్‌ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు

Medigadda Barrage Damage Issue : ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తైన తర్వాత డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ రెండేళ్లు. ఆ తర్వాత మూడేళ్లపాటు నిర్వహణ గుత్తేదారే చేయాలి. అయితే డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ఎప్పుడు మొదలైందో, నిర్వహణ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పని పూర్తైనట్లు మూడుసార్లు ధ్రువీకరణ పత్రాలిచ్చారని నిర్ధారించారు. ఓవైపు పని పూర్తైనట్లు ధ్రువపత్రం ఇస్తూనే ఇంకోవైపు ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, బ్యారేజీకి పలు చోట్ల నష్టం వాటిల్లిందని గుత్తేదారు సంస్థకు లేఖలు రాయడం జరిగిందని విజిలెన్స్‌ అండ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం గుర్తించింది.

Vigilance Inquiry on Kaleshwaram Project : కానీ ఏజెన్సీ నుంచి తగిన స్పందన లేకున్నా, బిల్లులు ఎక్కడా ఆగకుండా చెల్లించేశారని పేర్కొంది. రికార్డులు ఇవ్వాలని విజిలెన్స్‌, ఇంజినీర్లకు లేఖ రాస్తే వారు గుత్తేదారుకు లేఖ రాశారని తెలిపింది. ఒప్పందం ప్రకారం పనిపూర్తైన తర్వాత కాఫర్‌ డ్యాంని నిర్మాణ సంస్థ తొలగించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. తద్వారా నష్టం జరిగింది. 2019లో నిర్మాణం పూర్తై బ్యారేజీని ప్రారంభించగా 2021 సెప్టెంబర్ 6న నిర్మాణ వ్యయాన్ని రూ.3,260 కోట్ల నుంచి రూ.4,613 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో330 జారీచేసిందని నివేదికలో విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

Vigilance Checks on Medigadda Barrage : పని పూర్తిస్థాయిలో కాకుండానే నీటిని నిల్వ చేయడంపై విజిలెన్స్‌ (Vigilance Inquiry) అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఎవరెవరు బాధ్యులు, ఎవరిపై ఎలాంటి చర్య తీసుకోవాలో తుది నివేదికలో సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం పనులు జరిగాయా, నాణ్యత ఏంటి తదితర అంశాలను తెలుసుకొనేందుకు కోర్‌ కటింగ్‌ చేయగా, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు ఏజెన్సీ ప్రతినిధులు అంగీకరించలేదని విజిలెన్స్‌ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాలకు ఆధారంగా ఫొటోలు, ఇంజినీర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, ఒప్పందంలోని క్లాజులను విజిలెన్స్‌ వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది.

మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్‌ డ్యాం - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

మేడిగడ్డ పూర్తయినట్టా కానట్టా - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

Last Updated : Feb 4, 2024, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.