ETV Bharat / state

మరోరెండ్రోజుల్లో జనజాతర - మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు - Medaram Pagididda Raju

Medaram Pagididda Raju : మరో రెండ్రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. జనజాతర ప్రారంభమైన తర్వాత వనదేవతలు ఒక్కొక్కరుగా గద్దెలు చేరుతుంటారు. మరోవైపు ఇప్పటికే పగిడిద్దరాజు మేడారం జాతరకు పయనమయ్యారు. ఆరెం వంశీయులు ఇవాళ పగిడిద్దరాజు (సమ్మక్క భర్త)ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళ్తున్నారు.

Police Awareness on Medaram Jatara
మేడారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పగిడిద్దరాజు - సంప్రదాయ రీతిలో తీసుకెళ్లనున్న ఆరెం వంశీయులు
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 2:27 PM IST

Medaram Pagididda Raju : వనంలో నుంచి జనంలోకి వనదేవతలు వచ్చే సమయం ఆసన్నమవుతోంది. లక్షల మంది భక్తులు జనసంద్రంగా మారి జంపన్నవాగులో జలకాలాడే తరుణం వచ్చేస్తోంది. మరోరెండ్రోజుల్లో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతోంది. జాతర జరిగే మూడ్రోజుల్లో మొదటిరోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్కను కుంకుమభరిణె రూపంలో చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు.

Medaram Jatara 2024 : ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి మేడారానికి పగిడిద్దరాజు (సమ్మక్క భర్త) బయలు దేరారు. ఆరెం వంశీయులు సంప్రదాయ రీతిలో మేడారానికి కాలినడకన తీసుకెళ్తున్నారు. పగిడిద్దరాజుకరు సంబంధించిన జెండాలతో ఆరెం వంశీయులు బయలుదేరి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా గుండాల మండలం వేపలగడ్డలోని పగిడిద్దరాజు గర్భగుడిలోని జెండాలకు, శివశత్తులకు, పురాతన అభరణాలకు( గిరిజన పురోహితులు) వడ్డేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Medaram Sammakka Saralamma Jatara : అనంతరం గిరిజన నృత్యాలు డప్పు వాద్యాలతో పగిడిద్దరాజును తీసుకొని మేడారానికి వెళ్తున్నారు. జాతర ముందు రోజు మంగళవారం జంపన్న వాగు వద్ద బస చేస్తారు. బుధవారం రోజున పగిడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆరెం వంశీయులు పగిడిద్దరాజును గుండాలకు చేర్చుతారు. మార్చి మొదటి వారంలో గుండాల మండలం వేపలగడ్డలో ఉన్న పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పగిడిద్దరాజుకు సమ్మకకు నాగవెల్లి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరెం వంశీయులు రెండు రోజులపాటు జాతర జరుపుతారు. ఈ జాతరలో గ్రామాల ప్రజలు పాల్గొని పగిడిద్దరాజు సమ్మక్కలకు మొక్కులు చెల్లించుకుంటారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

Police Awareness on Medaram Jatara : ఇప్పటికే మేడారానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహాజాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు ఆభరణాలు వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. లక్షలాదిమంది తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మేడారానికి వెళ్లే భక్తులకు ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి వడ్డే చిరంజీవి గత 12 సంవత్సరాలుగా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ములుగు జిల్లా పసిర వద్ద మంచినీటి వసతి కల్పిస్తున్నారు. అదే గ్రామంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో ఏర్పాటు చేసిన మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు క్యాంపులో శుద్ధి చేసిన మంచినీటి వసతిని కల్పించారు. జాతర అయిపోయేంత వరకు 24 గంటలు నీటి వసతి ఉంటుందని చిరంజీవి తెలిపారు.

మరో రెండ్రోజుల్లో మహాజాతర - భక్తులతో జనసంద్రంగా మారనున్న మేడారం

మేడారం మహా జాతరకు సిద్ధమైన ఆర్టీసీ - ఈసారి 6 వేల బస్సుల ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.