ETV Bharat / state

మెడికోస్​ హాస్టల్​లో భారీ చోరీ - ₹20 లక్షల విలువైన లాప్​టాప్​లు ఫోన్లు మాయం - Theft in Medical College Hostel

Massive Theft in Anantapur Medical College Hostel : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 20 లక్షల విలువ చేసే లాప్​టాప్​లు విద్యార్థుల మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 1:38 PM IST

massive_theft_in_anantapur_medical_college_hostel
massive_theft_in_anantapur_medical_college_hostel (ETV Bharat)

Massive Theft in Anantapur Medical College Hostel : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున హాస్టల్‌లోకి ప్రవేశించి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వరకు విద్యార్థులు చదువుకుంటూ తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని గుర్తించిన దుండగులు ఏకంగా వసతి గృహంలోకి ప్రవేశించి ఎవరికీ అనుమానం రాకుండా 20 లక్షల విలువైన లాప్‌టాప్‌లు, ఫోన్లు దోచుకెళ్లారు. నిత్యం సీసీటీవీ (CCTV) ల పర్యవేక్షణలో ఉన్న హాస్టల్‌లో దొంగతనం జరగడం అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు కొందరు అనుమానిస్తున్నారు. అయితే చోరీపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Rs 20 Lakh Worth Laptops Mobiles Phones Theft : అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది నిత్యం సీసీ టీవీల పర్యవేక్షణ ఉండి, నగరం నడిబొడ్డున ఉన్న మెడికల్ కాలేజ్​ హాస్టల్​లో చోరీ జరగడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. వీటిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ప్రధాన సూత్రధారులు వసతి గృహం గురించి తెలిసిన వారే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెబుతున్నారు.

ఫాలో చేసి మూడున్నర లక్షలు కొట్టేశారు! - ₹3 Lakhs Robbery in Srikakulam

Theft in Anantapur Medicos Hostel : దొంగలు వచ్చి దర్జాగా దోచుకుని పోతుంటే వసతి గృహం భద్రతా సిబ్బంది ఏమైనట్టని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వారే ఇదంతా చేయించి ఉండొచ్చని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అసులు ఘటనకు సంబంధించి కేసు ఎందుకు నమోదు చెయ్యలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పై పోలీసులకు తెలపకపోవడం పై పలువురు విద్యార్థుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ నిర్లక్ష్యమే కారణమని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పట్టపగలే 66 లక్షలు చోరీ కేసు - బెయిల్​పై వచ్చి నిందితుడు ఆత్మహత్య - Accused Committed Suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.