ETV Bharat / state

విశ్వసనీయతకు మారుపేరు - నమ్మకమైన నేస్తం 'మార్గదర్శి' - MARGADARSI NEW BRANCHES

నేడు మార్గదర్శి చిట్​ఫండ్​ కంపెనీ రెండు బ్రాంచ్​లు ప్రారంభం - కర్ణాటక, తమిళనాడులో ఏర్పాటు

Margadarsi Chit Fund
Margadarsi Chit Fund (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 9:56 AM IST

Updated : Dec 11, 2024, 10:13 AM IST

Margadarsi Chit Fund : చిట్​ ఫండ్​ పరిశ్రమలో నమ్మకమైన, అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్​ ఫండ్​ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మరో రెండు శాఖలను ప్రారంభించనుంది. ఇవాళ బెంగళూరులోని కెంగేరిలో 119వ శాఖను ప్రారంభించనుంది. అలాగే తమిళనాడులోని హోసూర్​లో 120వ శాఖను సాయంత్రం ప్రారంభించనున్నారు. అత్యంత విశ్వసనీయమైన, కస్టమర్​ ఫ్రెండ్లీ మార్గదర్శి చిట్​ ఫండ్​ కంపెనీకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో నెట్​వర్క్​ ఉంది. నమ్మకమే మారుపేరుగా అందరి మదిలో మార్గదర్శి సుస్థిర స్థానం సంపాదించుకుంది.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త బ్రాంచ్​లు ప్రారంభించనున్న సందర్భంగా మార్గదర్శి చిట్​ఫండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజా కిరణ్ మంగళవారం​ మీడియాతో మాట్లాడారు. "బెంగళూరులోని కెంగేరిలో బ్రాంచ్​ను ప్రారంభించడం మాలక్ష్యంలో ఒక ముఖ్యమైన ముందడుగు. కర్ణాటక ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రం మరింత చేరువైంది. మా చందాదారులు తమ లక్ష్యాలను సాధించటంలో సహాయపడటానికి సురక్షితమైన, పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపు ఎంపికలను అందించడానికి మార్గదర్శి చిట్​ఫండ్​ కట్టుబడి ఉంది." అని తెలిపారు.

విశ్వసనీయతే ఆయుధం : 1962లో ప్రారంభమైనప్పటి నుంచి మార్గదర్శి చిట్​ ఫండ్​ విశ్వాసం, విశ్వసనీయతకు మారుపేరుగా ఉందని మార్గదర్శి చిట్​ఫండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజా కిరణ్​ అన్నారు. 60 లక్షల మంది సబ్​స్కైబర్​లకు సేవలు అందిస్తోందని తెలిపారు. అలాగే రూ.9,396 కోట్ల టర్నోవర్​ సాధించిందని పేర్కొన్నారు. సమగ్ర, ఆర్థిక, క్రమశిక్షణ, పారదర్శకత, ప్రతిదానికి భరోసా చందాదారుల డబ్బు సురక్షితమైన చేతుల్లో ఉందని మేనేజింగ్​ డైరెక్టర్​ స్పష్టం చేశారు.

"ఆరు దశాబ్దాలకు పైగా మార్గదర్శి కుటుంబాలు, వ్యాపారాలకు నిధులు సమకూర్చడం, విద్య, వివాహాల నుంచి గృహాలను కొనుగోలు చేయడం, సంస్థలకు వర్కింగ్​ క్యాపిటల్​కు, సురక్షితమైన పదవీ విరమణ పొందడం వరకు వారి కలలను సాకారం చేయడంలో మద్దతు నిస్తోంది. కెంగేరిలోని కొత్త బ్రాంచ్​ మార్గదర్శి జీవితాలను శక్తివంతం చేసే ప్రయాణంలో మరో అడుగు. అలాగే ఆర్థిక వృద్ధికి అవకాశాలను సృష్టించడం." అని మార్గదర్శి మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజా కిరణ్​ అన్నారు.

మార్గదర్శి చిట్ ఫండ్ :

  • స్థాపించబడింది - 1962
  • చందాదారులు - ఇప్పటివరకు 60 లక్షలకు పైగా సేవలు
  • టర్నోవర్​ - రూ.9,396 కోట్లు
  • బ్రాంచ్​ నెట్​వర్క్​ - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు అంతటా కలిసి ఇప్పుడు ప్రారంభించే శాఖలతో కలిపి 120 శాఖలు

జగిత్యాల, సూర్యాపేటలో మార్గదర్శి నూతన శాఖల ప్రారంభం

విశ్వసనీయతకు మారుపేరుగా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ - హైదరాబాద్​లో 111వ శాఖను ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్‌

Last Updated : Dec 11, 2024, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.