ETV Bharat / state

'ఫోన్లు వాడడం లేదు - ఎక్కడికి వెళ్లలేదు' - పోలీసుల విచారణలో వైఎస్సార్సీపీ నేతల సమాధానం - Police Questioned YSRCP Leaders

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 9:51 AM IST

TDP Office Attack Case Updates : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై, దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Police Questioned YSRCP Leaders
Police Questioned YSRCP Leaders (ETV Bharat)

Police Questioned YSRCP Leaders : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి పోలీస్​స్టేషన్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరందరినీ పోలీసులు వేర్వేరుగా విచారించారు. శనివారం రాత్రి 8 గంటలకు విచారణకు వచ్చి జోగి రమేశ్​ను పోలీసులు గంట పాటు ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు పాస్‌పోర్టులు సమర్పించగా, ఇద్దరు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

పోలీసులకు ఫోన్లు అప్పగించేందుకు నిందితులు నిరాకరించారు. తాము ఫోన్లు వాడడం లేదని బదులిచ్చారు. కోర్టులు ముందస్తు బెయిల్స్‌ నిరాకరించే వరకూ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను పోలీసుల అదే విషయంపై ప్రశ్నించారు. ఐతే తాము ఇళ్ల వద్దే ఉన్నామని, ఎక్కడికి వెళ్లలేదని బదులిచ్చారు. జోగి రమేష్‌ మాత్రం వరదల వల్లే తాను ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశానని చెప్పినట్లు తెలిసింది. తాము అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలు అవకాశం దొరికినప్పుడల్లా నోరుపారేసుకున్న వైఎస్సార్సీపీ నేతలు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

"వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించలేదు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారు ఏమీ గుర్తులేదని అంటున్నారు. సెల్‌ఫోన్‌ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. వాళ్లు చెప్పిన జవాబులు సరిచూసుకుని మళ్లీ నోటీసులు ఇస్తాం. ఐదుగురిలో ముగ్గురు మాత్రమే పాస్‌పోర్టులు ఇచ్చారు. తనకు పాస్‌పోర్టు లేదని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు." - మురళీకృష్ణ, మంగళగిరి డీఎస్పీ

YSRCP LEADERS : అరెస్టు భయం - కోర్టు తీర్పు రావడమే ఆలస్యం, అబ్‌స్కాండ్ అయ్యారా? స్టేట్ దాటి వెళ్లారా? - YSRCP LEADERS ARREST FEAR

YSRCP Leaders Attack on TDP Office : 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్‌ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో విచారణ ముందుకు సాగలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ - రెండు వారాలు రిమాండ్ - EX MP Nandigam Suresh Arrest

వారికి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు - వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు: లూథ్రా - MANGALAGIRI TDP OFFICE ATTACK CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.