Man Suicide in Attapur : నేటి సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా వెనకాడటం లేదు. తాజాగా డబ్బు విషయంలో ఓ తండ్రిని కుమారుడే మోసం చేశాడు. దీంతో ఆయన మనస్తాపంతో బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి (Hyderabad Suicide Cases ) పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Son's Cheating Caused Father Suicide : ఎల్‌ఐసీ సలహాదారుగా పనిచేసే దేవీదాస్ అగర్వాల్ భార్య ఆశాకిరణ్ అగర్వాల్‌తో కలిసి అత్తాపూర్‌లోని ఉప్పర్‌పల్లిలో మూడేళ్లుగా నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే కుమారుడు మహదేవ్ వివాహం చేసుకొని వేరుగా ఉంటున్నాడు. కొంతకాలంగా అతను సరిగ్గా పనిచేయకుండా డబ్బులు కావాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. సొంతంగా క్యాబ్ కొనుక్కుంటానని దేవీదాస్ అగర్వాల్ వద్ద డబ్బులు తీసుకున్నాడు. కానీ మహదేవ్ క్యాబ్ మాత్రం కొనకుండా వాటిని ఖర్చు చేశాడు.
ఈ క్రమంలోనే కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో దేవీదాస్ అగర్వాల్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం సాయంత్రం హ్యాపీ హోమ్స్ ఫార్చూన్ వద్దకు వెళ్లాడు. తాను అందులో ఉండేందుకు ఇళ్లు అద్దెకు కావాలని వాచ్‌మెన్‌కు చెప్పి లోనికి వెళ్లిన దేవీదాస్ లిఫ్ట్ ద్వారా పదో అంతస్థుకు చేరుకొని అక్కడ్నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
కుటుంబంలో చెలరేగిన వివాదం : కుటుంబంలో చెలరేగిన వివాదం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఆశాకిరణ్ అగర్వాల్ ఆరోపించారు. కుమారుడు మహదేవ్ ఆయన వద్ద డబ్బులు తీసుకున్నాడని ఆ విషయమే మృతికి ప్రధాన కారణమని ఆమె తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారాణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎంసెట్ క్లాసులు అర్థం కావడం లేదని- తండ్రి పుట్టిన రోజున కుమారుడి ఆత్మహత్య - student suicide
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!