A Man Stealing Shoes : ఎక్కడైనా దొంగలు డబ్బు, బంగారం, బైకులు, విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. కానీ ఈ దొంగ స్టైలే సెపరేటు. అందరిలాగా దొంగతనం చేస్తే ఏం ఉంటుందిలే కిక్కు అనుకున్నాడేమో.. నగదు, గోల్డ్, విలువైన వస్తువులను ముట్టకుండా కేవలం వాటినే అందిన కాడికి దోచేస్తున్నాడు. అది కూడా అర్ధరాత్రి తిరుగుతూ అందిన కాడికి దోచేస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతవాసులు రాత్రుల్లో కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ఆ దొంగ ఏం దొంగతనం చేస్తున్నాడో తెలుసా? బూట్లు. ఏంటీ 'షూ' నా అంటూ అవాక్కు అవుతున్నారా! నిజమే మీరు విన్నది ఆ దొంగ కేవలం బూట్లనే దొంగతనం చేస్తాడు. ఇంతకీ ఏ ప్రాంతంలో తెలుసా?
హైదరాబాద్లోని రామంతాపూర్ డిజివిజన్ శ్రీరామకాలనీలోని ఓ దొంగ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి కాలనీలో తిరుగుతూ ఇంటి బయట ఉన్న బూట్లను దొంగలిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇలానే జరుగుతుండటంతో కాలనీవాసులకు అనుమానం వచ్చింది. ఏంటి ఎప్పుడూ షూష్నే పోతున్నాయని. కొన్ని రోజుల నుంచి కాలనీలోని పలువురి ఇళ్లలో బూట్లు కనిపించకపోవడంతో స్థానికులు అయోమయానికి గురయ్యారు. ఏమవుతుందోనని తెలుసుకోవడానికి సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
ఆ సీసీ ఫుటేజీలను చూస్తే ఆ కాలనీవాసులకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. అర్ధరాత్రి వేళ ఓ దొంగ ఇంటి గేటు లోపలికి వచ్చి బూట్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ దొంగను గమనించిన స్థానికులు అతడు పక్కనే ఉండే వాసవినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నారు. ఈక్రమంలో మూడు రోజుల పాటు నిందితుడి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. బుధవారం మధ్యాహ్నం దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
కుప్పలుగా తెప్పలుగా బూట్లు : అతడిని తీసుకొని వాసవినగర్కు వెళ్లిన శ్రీరామకాలనీ వాసులు.. అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ వారికి కుప్పలు తెప్పలుగా బూట్లు కనిపించడం చూసి అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బూట్లు మాత్రమే ఎందుకు చోరీ చేశావని ప్రశ్నించగా.. అతని వద్ద నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో నిందితుడితో పాటు అతని భార్యను ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కాగా అతడి భార్య ఇటీవల ఫుల్గా మద్యం తాగి ఉప్పల్ ఠాణాలో హల్చల్ చేసిన విషయం పోలీసులకు తెలిసింది.
అంబులెన్స్ చోరీ చేసి బీభత్సం సృష్టించిన దొంగ - సినిమా రేంజ్లో ఛేజింగ్ - చివరకు!
ఈ లగ్జరీ దొంగ లైఫ్ స్టైలే వేరు : విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటల్లో విడిది - చేసేది మాత్రం?