Man Spot Dead in Firecracker Explosion in Eluru : దీపావళి పండుగ పూట ఏపీలోని ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండా ప్రమాదవశాత్తు వాహనం గుంతలో పడటంతో బండి అదుపు తప్పింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నగరంలోని తూర్పు వీధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కిందపడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.