ETV Bharat / state

వైరల్​ వీడియో - అమెజాన్​లో ల్యాప్​టాప్​ బుక్​ చేస్తే నాపరాయి వచ్చింది - బాధితుడు ఏం చేశాడంటే ?

అమెజాన్​లో ల్యాప్​టాప్​ బుక్​ చేసిన ఓ వ్యక్తి -​ పార్సిల్​లో ల్యాప్​టాప్​కు బదులు ఒక నాపరాయితోపాటు విరిగిన కీ బోర్డు - ఖంగుతిన్న బాధితుడు - పోలీసులను ఆశ్రయించగా వారు ఏం అన్నారంటే ?

AMAZON FRAUD DELIVERY IN HYD
Amazon Delivers Stone Instead of Laptop (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 19 minutes ago

Amazon Delivers Stone Instead of Laptop : ఒకప్పుడు ఏదైనా వస్తువో లేదా డ్రెస్సో కావాలంటే బయటకు వెళ్లి షాపింగ్​ చేసే వాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. ప్రస్తుతం ఏ చిన్న వస్తువు అయినా మంచి డ్రెస్ కావాలన్నా ఆఖరికి ఇంట్లోని వంట వస్తువులు కూడా ఆన్​లైన్​లోనే బుక్​ చేసుకుంటున్నాం. ఇదంతా అందరికీ తెలిసిందేగా మరి ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా ? అసలు మ్యాటర్​ ఏంటంటే ఓ వ్యక్తి అందరిలాగానే ఆన్​లైన్​లో షాపింగ్​ చేశాడు. కానీ ఆయనకు అందరిలా కాకుండా పార్సిల్​లో ఖంగు తినేలా ఐటమ్​ వచ్చింది. వేల రూపాయలు పెట్టి ఆన్​లైన్​లో ల్యాప్​టాప్​​ బుక్​ చేసుకుంటే పార్సిల్​లో ​ఒక నాపరాయి వచ్చింది. పార్సిల్​ను​ చూసి ఖంగుతిన్న బాధితుడు, ల్యాప్​టాప్​ బుక్​ చేస్తే నాపరాయి వచ్చిందేంటీ బ్రో అంటూ వాపోయాడు.

పార్సిల్ చూసి షాక్ : ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరలవుతోంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ గ్రామంలో ఉంటున్న బి. ప్రణయ్ అనే వ్యక్తి ఈనెల 21న అమెజాన్​లో ల్యాబ్​టాప్​ బుక్​ చేశాడు. ఇవాళ ఆయన చేసిన ఆర్డర్​​ డెలివరీ అయింది. ఈ నేపథ్యంలో అమెజాన్ పేరిట వచ్చిన పార్సిల్​ను విప్పి చూడగా అందులో ఒక నాపరాయితో పాటు విరిగిపోయిన ల్యాప్​టాప్​ కీబోర్డు ఉంది. దీంతో బాధితుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దీంతో మోసపోయిన అని గ్రహించిన బాధితుడు దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. తగిన ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని వారు బాధితుడికి సూచించారు.

పార్సిల్​ విషయంలో జాగ్రత్తలు : ఇటీవల కాలంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ఈ కామర్స్​ సంస్థలు సైతం జాగ్రత్తలు తీసుకుంటూ ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. వినియోగదారులకు డెలివరీ చేస్తున్న సమయంలోనే పార్సిల్​లో వచ్చిన ఐటమ్​ను మనం చెక్ చేసుకున్నాక డెలివరీ చేసే వ్యక్తి ఫొటో తీసుకుంటున్నారు. దీని వల్ల మనకు ఎలాంటి సమస్య ఉండదు.

పార్సిల్​లో షాకింగ్ ఐటెమ్- ప్రొడక్ట్​తోపాటు 'పాము' డెలివరీ- చిప్స్ ప్యాకెట్​లో కప్ప! - Snake In Amazon Package

ల్యాప్‌టాప్‌ బుక్‌ చేస్తే రాయి వచ్చింది.. పార్సిల్‌ ఓపెన్​ చేసి ఖంగుతిన్న వినియోగదారుడు

Last Updated : 19 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.