Man Opens Liquor Shop in Container in Visakhapatnam : ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి కొత్త మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మద్యం ప్రియల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ప్రభుత్వంలో నాసిరకం లిక్కర్ విక్రయించారని మందుబాబులు ఆరోపించారు. ఊరూపేరు లేని మద్యం తమను ముంచెత్తిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం టెండర్లు దక్కిన దుకాణదారుల పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారైంది. షాపులు తీసుకోవాలి, మద్యం తెప్పించాలి, అమ్మకాలు చేయాలి అంటే కాస్త సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితిని ఇప్పుడు చాలా మంది దుకాణదారులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యే ఎదురైన ఓ వ్యాపారి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. షాపు దొరికే వరకు వేచి చూడకుండా, ఆదాయం పోగొట్టుకోకుండా తన సమస్యను పరిష్కరించుకుని మందుబాబుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. అసలు అతడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ పే కొట్టు - నచ్చిన బాటిల్ పట్టు - ఏపీలో కళకళలాడుతున్న మద్యం దుకాణాలు
ఆదాయం కోల్పోకుండా : విశాఖ మహా నగరంలో నూతన విధానంతో లాటరీ మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు విక్రయాలు ప్రారంభించారు. ముఖ్యంగా విశాఖలో ఒక్క రోజు విక్రయాలు ఆగినా, భారీగా ఆదాయం కోల్పోయినట్లే. ఇటీవలే లైసెన్సు లభించిన ఓ వ్యక్తి అక్కయ్యపాలెం జగ్గరావు బ్రిడ్జి వద్ద దుకాణం ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. కానీ అక్కడ భవనం నిర్మాణంలో ఉంది. అద్దెకు గదులు దొరకడం లేదు. ఆలస్యం చేస్తే అదాయం కోల్పోవాల్సి వస్తుంది.
దీంతో ఆలస్యం చేయకుండా వినూత్నంగా ఆలోచించి కంటైనర్‌లో దుకాణం ఏర్పాటు చేసి అమ్మకాలు ప్రారంభించాడు. ర్యాక్స్ ఏర్పాటు చేసి అందులో మందు బాటిళ్లను పెట్టారు. కంటైనర్‌కు పెద్ద బ్యానర్ కట్టారు. ప్రస్తుతం అందులో నుంచి మందు విక్రయాలు జరుపుతున్నాడు. భవన నిర్మాణం పూర్తి కాగానే, అందులోకి మార్చుతామని తెలిపాడు. దీంతో మందుబాబులు 'మాకు ఎక్కడైనా ఓకే' అంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఆ షాప్ చూడటానికి వెళ్తున్నారు.
ఏపీ మద్యం పాలసీ ట్విస్ట్‌లు - మంత్రి నారాయణ 100 దరఖాస్తులు చేస్తే ఎన్ని వచ్చాయో తెలుసా?