Man Killed His Brother-in-Law for Property in Gachibowli : కావలి పట్టణంలోని ఉత్తర జనతాపేటలో నివసించే మద్దసాని ప్రకాశం బంగారు వ్యాపారంతో రూ.కోట్లు సంపాదించారు. రెండు సంవత్సరాల క్రితం కుమార్తెను సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు గచ్చిబౌలిలో పీజీ హాస్టళ్లకు యజమాని. వాటిని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల్లో, క్రికెట్ మ్యాచుల్లో పందేలు పెట్టి రూ.5 కోట్లు నష్టపోయాడు. అప్పులోళ్ల వేధింపులు భరించలేక అత్తింటి ఆస్తిపై కన్నేశాడు.
అత్తమామల ఆస్తిని కాజేయటానికి ప్లాన్ చేశాడు. తన హాస్టళ్ల నిర్వహణలో నమ్మకస్థులు కావాలంటూ అత్తామామలను నమ్మించాడు. బీటెక్ చదివి ఖాళీగా ఉన్న తమ కుమారుడిని అల్లుడికి సహాయం చేయడానికి సిద్ధపడి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు పంపించారు. అప్పుడప్పుడు అత్తమామలకు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిసయ్యాడని, అతడి స్నేహితులు ఇక్కడకు వచ్చారని చెప్పేవాడు. 4 రోజుల క్రితం అల్లుడి ఫోన్‌తో వారు షాక్‌కు గురయ్యారు.
ఆన్‌లైన్ బెట్టింగులతో రూ.2 కోట్ల అప్పు - తీర్చలేక కాలువలో దూకి ఆత్మహత్య
మృతదేహంపై గాయాలతో అనుమానం : వ్యసనాలకు బానిసైన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అల్లుడు చెప్పిన వార్తతో వారు కంగుతిన్నారు. మృతదేహాన్ని కావలికి తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే మృతదేహంపై గాయాలుండటంతో అనుమానాలు వచ్చాయి. దీంతో అత్తమామలు అతడి స్నేహితులపై ఆరా తీసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా, హత్య జరిగిన రోజు ఫుటేజీ ఆటోమేటిక్‌గా డిలీటైంది.
హాస్టల్ ఎదురుగా ఉండే దుకాణంలో సీసీ ఫుటేజీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో అనుమానం వచ్చిన వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీసు శాఖ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హై రెజల్యూషన్ సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అందులో ఓ కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.
అత్తమామల హ్యతలకు అడ్వాన్స్ తీసుకోవాలంటూ కాల్ : ఇందులో అల్లుడి పాత్ర ఉన్నట్లు కనుక్కున్నారు. శ్రీకాంత్‌తోనే కడపకు చెందిన గ్యాంగ్‌కు ఫోన్ చేయించి అత్తమామల హత్యలకు కూడా అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పించారు పోలీసులు. వారి ప్లాన్ ప్రకారం హత్య చేసిన నిందితులు శ్రీకాంత్‌ను కలవడానికి రాగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పొలం కోసమని తండ్రి ఇచ్చిన డబ్బులతో బెట్టింగ్ - ఉన్నదంతా పోయి చివరకు!
ఆన్‌లైన్ బెట్టింగులతో అప్పులు - తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు