Man Commits Suicide Due To Love Failure In Kadapa District Badvel : చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అనుకుంటున్నారు కొందరు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న వ్యక్తి ఏకంగా తన ప్రాణాలు తీసుకుని కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. అతడి తొందరపాటే ఈ ఘోరానికి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో నివాసముంటున్న యువతి యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ యువకుడు తన ప్రేయసినే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. అయితే, అతడి చేష్టలతో ఉన్నట్టుండి అమ్మాయి అతడ్ని దూరం పెట్టడం ప్రారంభించింది. దానికి కారణం ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించడమేనని భావించిన ఆ యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురై పెట్రోలుతో ఆ యువతిని సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తానే ఆ మంటల్లో దహనం కావడంతో యువకుడి కుటుంబం తీవ్ర శోకంలోకి మునిగిపోయింది.
స్థానికులు, పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో 108 వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న కలసపాడు మండలానికి చెందిన సాయికుమార్‌రెడ్డి అనే యువకుడు అదే మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. అది జీర్ణించుకోలేని సాయికుమార్ యువతిపై పెట్రోల్ పోసి తానూ పోసుకుని సజీవ దహనమవ్వాలని పథకం వేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నట్లు తెలిసి యువకుడు ఇంటికి వెళ్లాడు.
పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక ఓ జంట - కలిసి ఉండలేమని మరో జంట ఆత్మహత్య - Two Love Couples suicide
తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించటంతో తనపై పెట్రోల్ పోసి తానూ పోసుకున్నాడు. లైట్‌ర్ వెలిగించటానికి ప్రయత్నించేలోపు యువతి తప్పించుకుని పారిపోయింది. దీంతో అతను బద్వేలులో ఉంటున్న వాళ్ల సోదరి ఇంటికి వెళ్లి ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. ఇంట్లో దట్టమైన పొగ రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే అతను మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. అతడితో పాటే ఇంట్లోని సామాన్లు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్దం అయ్యాయి. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు బద్వేల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.