Man Attacked a Woman Mini ATM in Peddapalli With A Knife : ఇటీవల కాలంలో దొంగతనాలు, దోపీడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత పెరుగుతుంతో, అంతకు తగ్గ ప్లాన్స్ వేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. ముసుగులు ధరిస్తూ, ఆడవారి వేశం వేస్తూ, వాహనాల నంబర్లు మారుస్తూ, సీసీ కెమెరాలను ముందుగా చూసి వాటికి చిక్కకుండా ఇలా ప్రతి ఒక్కటి ప్లాన్ చేస్తూ దోపిడీలు చేస్తున్నారు. దుండగులు ఎన్ని వేశాలు వేసినా, పోలీసులు మాత్రం వారి భరతం పడుతున్నారు. చాలా సందర్భాల్లో దొంగలు చాలా నైస్‌గా వచ్చి చోరీ చేసి గుట్టుచప్పుడు లేకుండా దోచుకుని వెళ్తారు. కొన్నిసార్లు మాత్రం దాడులకూ వెనకాడటం లేదు. అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రావడం రావడం మహిళపై కత్తితో దాడికి దిగాడు. ఆ మహిళ అరుపులతో ఆ దొంగ అక్కడి నుంచి ఉత్తి చేతులతో వెనుదిరగక తప్పలేదు.
దసరా రోజున మద్యం షాపులో చోరీ - కౌంటర్లో ఉంచిన రూ.12 లక్షలతో పరారీ
విఫల యత్నం : కత్తితో దాడి చేసి చోరీకి యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఒక దుండగుడు మినీ ఏటీఎంలోకి ప్రవేశించి చోరీకి విఫలయత్నం చేశాడు. గ్రామానికి చెందిన రజిత తన భర్త మరణించిన తర్వాత టైలరింగ్, మినీ ఏటీఎం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతోంది.
శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏటీఎంలో కూర్చొని ఉండగా, ఒక దుండగుడు మూతికి ముసుగు కప్పుకుని, చేతిలో కత్తి పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నించాడు. కుర్చీలు, ఇతర సామగ్రి అంతా తీసి కింద పడేశాడు. డబ్బులివ్వాలంటూ ఆమెపై దాడికి యత్నించాడు. భయంతో ఆమె బిగ్గరగా కేకలు వేడయంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా, దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడికి యత్నించిన దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. మంథని పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
"నేను నా పనిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా నాపై దాడి చేశాడు. షాప్‌లో ఉన్న అన్ని వస్తువులను కింద పడేశాడు. దీంతో నేను గట్టిగా అరిచాను. నా అరుపులు విని అక్కడకు వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. ఛైర్లు విసిరేసుకుంటూ బయటకు పారిపోయాడు." - రజిత, బాధితురాలు.
చదువులో మాస్టర్స్ పూర్తి - చోరీల్లో సెంచరీ
ప్రయాణం వేల జర పైలం - ఏమరపాటుగా ఉన్నారో మీ వస్తువులు ఆగం - Travel Safety Tips In Telugu