Man Attack on Pubg Players in Anantapur District : డిజిటల్ కాలంలో చాలా మంది సెల్ ఫోన్లతో జీవితాన్ని గడుపుతున్నారు. గేమ్స్ సైతం సెల్ ఫోన్లలో ఆడుతున్నారు. ఆన్లైన్ గేమ్‌లలో పబ్జికి ఎంతో మంది యువత బానిసై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో పబ్జి ఆడుతున్న ఇద్దరు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో జరిగింది. దీంతో మండలంలోని పాలవాయి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పబ్జి ఆడుతున్న ఇద్దరు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
ఇద్దరిపై కత్తితో దాడి - ఒకరి పరిస్థితి విషమం : పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, పాలవాయి గ్రామంలోని పాల డెయిరీ వద్ద సోమవారం రాత్రి ఇద్దరు యువకులు పబ్జి ఆడుతున్నారు. ఇదే సమయంలో రామాంజనేయులు వీడియో తీశాడు. వీడియో తీస్తుండటాన్ని గమనించిన యువకులు ప్రశ్నించారు. వారి ముగ్గురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి లోనైన రామాంజనేయులు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చాడు. అనంతరం కోపంతో ఆ ఇద్దరి యువకులపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న యువకులను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్త కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.
మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్... ఆ తర్వాత పరిస్థితి చూస్తే..
25 మంది పోలీసులతో బందోబస్తు : ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు దాడికి పాల్పడిన రామాంజనేయులు ఇంటి తలుపులు, కిటికీలను తొలగించారు. అనంతరం వాటికి నిప్పు అంటించారు. రామాంజనేయులు ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాలవాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవి బాబు, గ్రామీణ సీఐ వంశీ కృష్ణ, సుమారు 25 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పోలీసులు ఘటనపై ఆరా తీశారు.
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్న బాలుడు