ETV Bharat / state

ఇస్రో ఉద్యోగికి నాలుగు పెళ్లిళ్లు - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - MULTIPLE MARRIAGES FRAUD CASE

చదివించి తొమ్మిది. మోసాలలో మాత్రం పీహెచ్​డీ. ఇస్రోలో హెచ్​ఆర్​ ఉద్యోగం అని చెబుతూ మోసాలు చేస్తున్న నిత్య పెళ్లికొడుకు అరెస్ట్​

MULTIPLE_MARRIAGES_FRAUD_CASE
MULTIPLE_MARRIAGES_FRAUD_CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 9:23 AM IST

Updated : Oct 8, 2024, 10:20 AM IST

Man Arrested For Multiple Marriages Fraud In Eluru Dist : సినిమాల్లో చూపించినట్లుగా నకిలీ కుటుంబ సభ్యులను సృష్టిస్తాడు. ఇస్రోలో (ISRO) ఉద్యోగం చేస్తున్నానని, విల్లాలు, బంగ్లాలు ఉన్నాయని, 100 ఎకరాలకు ఆసామినని అందరిని నమ్మిస్తాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని బుకాయిస్తాడు. ఇలా మాటల గారడీతో ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకును ఏలూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

వందెకరాల ఆసామినంటూ 4 పెళ్లిళ్లు: అంశం అనీల్‌బాబు అలియాస్‌ కల్యాణ్‌రెడ్డిది తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేట. ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోని టీచర్స్‌కాలనీలో ఉంటున్నాడు. 9వ తరగతి వరకు చదివాడు. ఓ మ్యాట్రిమోనిలో కల్యాణ్‌రెడ్డిగా రిజిస్టర్‌ చేయించుకున్నాడు. దీని ద్వారా తనను సంప్రదించిన వారికి ఫోన్‌ చేసి, కల్యాణ్‌రెడ్డి (వరుడు) తండ్రిని మాట్లాడుతున్నానని ఇతరులతో చెప్పించేవాడు. 'మా అబ్బాయి కల్యాణ్​రెడ్డి ఇస్రోలో హెచ్‌ఆర్‌ ఇన్‌ఛార్జి. నేను, నా భార్య ఇక్కడ ఇంజినీర్లుగా పనిచేస్తున్నాము' అని చెప్పేవారు. మా అబ్బాయి పెళ్లిచూపులకు వస్తాడు అని అమ్మాయి కుటుంబ సభ్యులను నమ్మించేవాడు. కల్యాణ్​రెడ్డి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తమ తల్లిదండ్రులకు లీవ్​ దొరక్కపోవడంతో రాలేకపోయారని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. తాను డబ్బున్న వాడినని అమ్మాయి తరపు వారు నమ్మేలా హైదరాబాద్‌ శివారు చేవెళ్లలో ఓ ఫామ్‌హౌస్, బెంగళూరులో ఓ విల్లా అద్దెకు తీసుకున్నాడు. అవి తనవేనని చెప్పి వారిని నమ్మించాడు. తను ఎప్పుడు ఓ వ్యక్తిని, పెళ్లి చేసే పంతులును వెంటే ఉంచుకునేవాడు.

ప్రియురాళ్ల సిగపట్లు-మంటల్లో కారు! అపార్ట్​మెంట్​లో రచ్చరచ్చ - Triangle Love Story

ఇలా చిక్కాడు : గత ఏడాది (2023) 5వ పెళ్లి చేసుకునేందుకు అనీల్‌బాబు ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన గుండా లక్ష్మీకుమారిని సంప్రదించాడు. ఆమె 2వ కుమార్తెను పెళ్లి చేసుకుని, 3వ కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. దఫదఫాలుగా వారి నుంచి 9.53 లక్షలు రూపాయలు కాజేశాడు. ఈ క్రమంలోనే తన వద్ద పని చేస్తున్న తుంగా శశాంక్‌ అనే మహిళతో ఇంటర్వ్యూ చేయించి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కూడా ఇప్పించాడు. కొద్ది రోజులు తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు భీమడోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై భీమడోలు సీఐ విల్సన్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్​ 8న) డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గుండుగొలను సమీపంలో నిందితులను అరెస్టు చేశారు. అనీల్‌బాబు గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించారు. వారి నుంచి రూ.1.50 కోట్ల వరకు కాజేసినట్లు ఎస్పీ ప్రతాప్​ శివకిశోర్​ తెలిపారు. ప్రధాన నిందితుడు అనీల్‌బాబు అలియస్​ కల్యాణ్​రెడ్డితో పాటు వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లకు చెందిన తుంగా శశాంక్, కారు డ్రైవరు నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తులూరుపాడుకు చెందిన పల్లె హేమంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. వారి ఇరువురి నుంచి 2 లక్షల రూపాయల నగదు, కారు, సెల్‌ఫోన్లు, 13 సిమ్‌లు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

తల్లి ప్రేమకు నిర్వచనంగా నిలుస్తున్న షీబా - పాపకు పునర్జన్మ! - sheeba from Sattenapalle

"అధిక వడ్డీ, తక్కువ ధరకే వస్తువులు"- రూ.2.5 కోట్ల ఘరానా మోసం - Cheater Arrested on police

Last Updated : Oct 8, 2024, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.