Mallu Ravi Appointed as Special Representative of Telangana : దిల్లీలో తనను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై కాంగ్రెస్ నేత మల్లు రవి(Mallu Ravi) హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఉంటానని, తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ దిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ఏఐసీసీ(AICC) పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతాం : సీఎం రేవంత్
Congress Latest News : తనకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, తెలంగాణకు సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు సహా నీటి ప్రాజెక్టులు, ఆర్థిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 15 అంశాల పట్ల ప్రధానికి విజ్ఞాపనలు అందజేశారని, ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పని చేసిన అనుభవం తనకు ఉందని, అందుకే ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చారన్నారు. తనపై నమ్మకం, పని చేసే సమర్థత గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి(CM Revaanth Reddy) దిల్లీలో ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు అప్పగించారన్నారు. కాంగ్రెస్ నేత మల్లురవి గతంలో నాగర్‌కర్నూల్ ఎంపీగా, దిల్లీలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు.
"దిల్లీలో నన్ను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నా ధన్యావాదాలు. నాకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. దిల్లీలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ కర్తగా ఉంటాను. తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తాను. నాపై నమ్మకం, నాలోని పని చేసే సమర్థతను గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు". - మల్లు రవి, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి