Mallikarjun Kharge Fires on Modi : తెలంగాణలో రేవంత్ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తొందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్తలే బలమని, పార్లమెంట్ ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. మోదీని ఎదిరిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.
'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్ ఇచ్చిన ఆప్, టీఎంసీ
Congress Latest News : దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం(Modi) ప్రకటనలు తప్ప, పనులు శూన్యమని ఖర్గే ఎద్దేవా చేశారు. మోదీ మాయ మాటలు విని ప్రజలు మోసపోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, ప్రజలకు న్యాయం కోసమే రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారన్నారు.
దేశంలో నిరుద్యోగం తగ్గిందని మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని, దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని ఖర్గే పేర్కొన్నారు. దేశాన్ని మోదీ అప్పుల్లో ముంచారని, దేశ ప్రజల సమస్యలు పరిష్కరించరు కానీ పక్కదారి పట్టిస్తారని విమర్శించారు. తప్పుడు విధానాలతో మోదీ ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఖర్చుతో మోదీ ప్రచారం చేసుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు. బీజేపీని ఓడించి 'ఇండియా' కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.
"దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలి. మోదీ మాయ మాటలు విని ప్రజలు మోసపోవద్దు. మోదీ ప్రభుత్వంలో ప్రకటనలు తప్ప, పనులు శూన్యం. దేశంలో నిరుద్యోగం తగ్గిందని మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది". - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు.
దీదీ షాక్- బంగాల్లో టీఎంసీ ఒంటరి పోరు- చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్
Congress Booth Level Agents Meeting : హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశాన్ని పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 17 గెలవాలని నేతలు పిలుపునిచ్చారు.
100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని భరోసానిస్తూ - జిల్లాల్లో మంత్రుల పర్యటనలు