ETV Bharat / state

మాక్లూర్ కస్తూర్బాలో ఏం జరుగుతోంది..? ఫిర్యాదుల పెట్టెలో సమస్యలు - Kasturba Gandhi Girls School Issue - KASTURBA GANDHI GIRLS SCHOOL ISSUE

kasturba Gandhi Girls Students Problems : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. 15 సంవత్సరాల కిందట నిర్మించిన కేజీబీవీ భవనానికి ప్రహరీ గోడ సైతం లేదు. దీంతో రాత్రివేళల్లో యువకులు చొరబడుతున్నారని విద్యార్థినులు భయపడుతున్నారు. మరోవైపు సమస్యలపై ప్రత్యేక అధికారిణి, సిబ్బందికి మధ్య వివాదం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.

Makloor Kasturba Gandhi Girls School Issue
kasturba Gandhi Girls Students Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 3:57 PM IST

Makloor Kasturba Gandhi Girls School Issue : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యేక అధికారిణి, సిబ్బందికి మధ్య వివాదం నెలకొందని తెలిసింది. 15 సంవత్సరాల కిందట నిర్మించిన కేజీబీవీ భవనానికి ప్రహరీ సైతం లేదు. భవనాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో రాత్రివేళల్లో యువకులు వస్తున్నారని విద్యార్థినులు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కస్తూర్బా విద్యాలయంలో 200 మంది ఇంటర్, 210 మంది పాఠశాల విద్యార్థినులు ఉన్నారు.

ఫిర్యాదుల పెట్టెలో సమస్యలు : రెండు నెలల క్రితం పాఠశాలకు కొత్తగా విధుల్లో చేరిన ప్రత్యేక అధికారిణి అనురాధ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసింది. దీంతో కొందరు సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనురాధకు, కొంతమంది సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తాయి. కొత్తగా వచ్చిన ప్రత్యేక అధికారి అనురాధ తమను ఇబ్బందిపెడుతుందంటూ సిబ్బంది ఇటీవల డీఈవోకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల కిందట జీసీడీవో భాగ్యలత కేజీబీవీకి వచ్చి విచారణ జరిపి నివేదికను డీఈవోకు అందజేశారు.

ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి : కేజీబీవీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను విద్యార్థినులు ఎవరితోనూ చెప్పుకోలేక పోయారని, తాను వచ్చాకే ఫిర్యాదు పెట్టెలో గోడు వెళ్లబోసుకుంటున్నారని ప్రత్యేక అధికారిణి అనురాధ చెబుతున్నారు. ఈ విషయాలపైనే సిబ్బందిని ప్రశ్నించానని తెలిపారు. సిబ్బంది ఆగడాలను అరికడుతున్నందుకే తనపై కొంతమంది అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

కేజీబీవీలో తలెత్తిన వివాదంపై వివరణ : మాక్లూర్‌ కేజీబీవీలో తలెత్తిన వివాదంపై వివరణ ఇవ్వాలని ప్రత్యేకాధికారిణికి బుధవారం నోటీసులు జారీ చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థినులు మాత్రం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. లేకుంటే తాము ఇక్కడ చదువుకునే పరిస్థితి లేదని వారంతా వాపోతున్నారు.

పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థుల ధర్నా - స్పందించిన అధికారులు - Kasturba Students Protest on Food

కేజీబీవీలో వంట మనుషులుగా మారిన విద్యార్థినులు - సిబ్బంది ఉన్నా వీళ్లు చేసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.