ETV Bharat / state

పంట రుణమాఫీపై మల్లగుల్లాలు - నేటికీ రైతుల ఖాతాల్లో జమకాని నగదు - Crop Loans Waiver Issues

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 11:46 AM IST

Updated : Aug 10, 2024, 12:26 PM IST

Crop Loans Waiver Issues : ఎన్నికలకు ముందు రూ.2 లక్షల లోపు పంటరుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకూ లక్షన్నర లోపు రుణమాఫీ చేసింది. కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రుణమాఫీ అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై కథనం.

Crop Loans Waiver Issues in Telangana
Farmers Crop Loans in Mahabubnagar (ETV Bharat)

Farmers Crop Loans Issue In Mahabubnagar : ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసింది. కాని ఆ డబ్బు రైతుల ఖాతాల్లో జమయ్యేందుకు మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక సాంకేతిక ఇబ్బందుల కారణంగా అర్హులైన రైతులకు ఇప్పటివరకూ రుణమాఫీ అమలు కాని పరిస్థితి నెలకొంది. మహబూబ్ నగర్ డీసీసీబీ పరిధిలో లక్షలోపు రుణాలున్న వాళ్లు 51వేల మంది ఉన్నారు. వారికి రూ. 236 కోట్ల వరకూ మాఫీ కావాలి. కాని ఇప్పటి వరకూ అయ్యింది కేవలం రూ.92 కోట్లు మాత్రమే.

లక్షలోపు రుణాలున్న సుమారు 30వేల మంది రైతులకు ఇంకా మాఫీ డబ్బులు చేరలేదు. ఇక లక్షన్నర లోపు 11వేల మందికి రూ.130 కోట్లు మాఫీ కావాలి. కానీ 9,500 మందికి రూ.68 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. ఇంకా రూ.60 కోట్లు వరకూ జమకావాల్సి ఉంది. ఎందుకీ పరిస్థితి ఏర్పడిందంటే అందుకు అనేక కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెబుతున్నారు.

అన్నదాతలు అధైర్యపడవద్దని వ్యవసాయ అధికారుల భరోసా : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, సుమారు రూ. 14కోట్ల రుణాలు రైతులకు అందకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 28 పీఏసీఎస్​లలో 1,677 మంది రైతులు తీసుకున్న రుణాలను కంప్యూటర్​లో నిక్షిప్తం చేయడంలో సిబ్బంది జాప్యం చేశారు. నిర్దేషిత కాలపరిమితిలో వారి సమాచారం కంప్యూటర్లలో నమోదు కాకపోవడంతో వారికి రుణమాఫీ అందలేదు.

"కొందరు రైతుల ఖాతాకు సంబంధించి పంట రుణమాఫీలో కొంతమంది కుటుంబ నిర్ధారణ జరగలేదని తెలుస్తోంది. అయినప్పటికీ వాటిని కూడా ప్రభుత్వ గుర్తిస్తుంది. ఫ్యామిలీ మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఆధార్ సంఖ్య నమోదులో తప్పులు దొర్లడం, రుణ నమోదులో దోషాలు ఉన్నాయి." -మిథున్ చక్రవర్తి, వ్యవసాయ అధికారి, మక్తల్ మండలం

Crop Loans Waiver Issues : జరిగిన తప్పిదాల్ని, జాప్యాన్ని టెస్కాబ్ దృష్టికి తీసుకువెళ్లామని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ సీఈఓ లక్ష్మయ్య తెలిపారు. అర్హులై ఉన్నా, చాలామందికి రుణమాఫీ డబ్బులు అందకపోవడంతో బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు వారిని వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పంపుతున్నారు. రుణమాఫీ ఎందుకు అమలు కాలేదో, వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

ఆలస్యమైనా సరే అర్హులై ఉంటే, తప్పకుండా అందరికీ రుణమాఫీ అమలవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినా, వివిధ కారణాలతో ఆ డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో రైతులు కొత్త రుణాలు తీసుకోవడంలోనూ జాప్యం జరుగుతోంది. వీలైనంత త్వరగా తప్పుల్ని సరిచేసి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

కౌంట్ డౌన్ స్టార్ట్ - మరో ఐదురోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ - TELANGANA LOAN WAIVER THIRD PHASE

అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం - రుణమాఫీకి దూరమైన 156 మంది రైతులు - FARMER LOAN WAIVER ISSUES

Last Updated : Aug 10, 2024, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.