ETV Bharat / state

పేద యువతుల బతుకుల్లో 'మ్యాజిక్' బస్​ - Magic Bus International NGO

Magic Bus International NGO Helping Poor Girls in Kurnool : పేదరికం కారణంగా అమ్మాయిలను పెద్ద చదువులు చదివించలేకపోతున్నారు తల్లిదండ్రులు. చదివిస్తే పెళ్లి చేయడం మరో అతిపెద్ద ఆర్థిక భారం అవుతుందని ఇంటికే పరిమితం చేస్తున్నారు. అయితే తమ కాళ్లపై తాము నిలబడాలి? కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే అమ్మాయిలెందరో ఉన్నారు. అలాంటి వారందరికి అండగా నిలబడుతోంది ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మరి నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్‌లో రాణించేందుకు సిద్ధమవుతున్న ఆ పేదింటి అమ్మాయిల కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

magic_bus_international_ngo
magic_bus_international_ngo (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 2:10 PM IST

Magic Bus International NGO Helping Poor Girls in Kurnool : పేదింటి అమ్మాయిలైనా చదువుకోవాలి, కెరీర్‌లో రాణించాలనే లక్ష్యాలు వీరివి. కానీ, వ్యవసాయ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల కారణంగా కెరీర్‌కు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితం అయ్యారు. అయినా స్వశక్తిగా ఎదగాలనే సంకల్పంతో చిన్ననాడే ప్రయత్నాలు మెుదలు పెట్టారు. వీళ్ల ఆసక్తికి అండగా నిలబడుతోంది. మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ. దీని సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు ఈ అమ్మాయిలు.

కర్నూలు వెనకబడిన జిల్లాగా పేదరికం అధికంగా ఉన్న ప్రాంతంగా ఉంటుంది. ఇలాంటి చోట ఆడపిల్లలపై వివక్ష సైతం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అమ్మాయిలకు చదువులు ఎందుకని, ఒకవేళ చదివించినా పదో, ఇంటర్ వరకో చదివించటం, ఆ తర్వాత పెళ్లి చేసి పంపించేయటం ఇక్కడ మామూలే. అయితే ఇలాంటి ఎంతో మంది యువతులకు మ్యాజిక్ బస్ అనే సంస్థ అండగా నిలుస్తోంది. 7 దేశాల్లో పని చేస్తున్న ఈ సంస్థ కర్నూలులో గత 14 ఏళ్లుగా యువతులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తోంది.

'మ్యాజిక్‌ బస్‌ అనే సంస్థ ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందికి పైగా యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించింది.18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండి, కనీసం పదో తరగతి పాసై ఇంటి వద్ద ఖాళీగా ఉండి, ఉద్యోగం అవసరమైన యువతులకు శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు తీసుకువెళితే మొదట కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత జాయిన్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌సహా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.' - శిక్షణ తీసుకుంటున్న యువతి

చదువుతోపాటు ఆసక్తి ఉన్న వారికి క్రీడల్లోనూ శిక్షణ ఇస్తోంది మ్యాజిక్‌ బస్‌ సంస్థ. ఇంట్లో, సమాజంలోని పరిస్థితులను తట్టుకునేలా కౌన్సిలింగ్‌లు ఇచ్చి, మనోధైర్యాన్ని నింపుతారు. ఇలా మొత్తం 45 రోజులపాటు ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఎన్ఐఐటీ ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ ఇస్తారు. బయట సంస్థలతో మాట్లాడి అభిరుచికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

శిక్షణ తీసుకుంటూ చదువుకోవాలనుకునేవారిని సైతం ప్రోత్సహించి కళాశాలల్లో చేర్పిస్తోంది మ్యాజిక్‌ బస్‌ సంస్థ. ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ పొందినవారు కర్నూలు, హైదరాబాద్‌ సహా వివిధ పట్టణాల్లోని పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. టెలీకాలర్స్‌, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధ్యాయులు, బీపీవోలుగా పని చేస్తున్నారు.టెక్ మహీంద్రా, ఈ-కామర్స్‌ లాంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడికి వచ్చే యువతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అన్నివిధాలా అండగా ఉంటున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన యువతులు సైతం ఇక్కడికి వచ్చిఅమ్మాయిల్లో మనోధైర్యాన్ని నింపుతుంటారు. ఈ సేవల పట్ల యువతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయివి ఇంకా నీకు చదువేందుకంటే వాళ్లందరితో వారించి ముందుకు వచ్చింది కొందరైతే, పెళ్లి వద్దని కెరీర్‌ ముఖ్యమంటూ బాటలు వెసుకుంటోంది మరికొందరు. అయినా వాళ్లను కోల్పోయి బతుకు కష్టం అవుతోంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి ఆసరా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కన్న కలల కోసం దొరికిన సదావకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సంకల్పంతో సాధన చేస్తున్నారు ఈ అమ్మాయిలు.

వాలీబాల్​ ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ​ - అంతర్జాతీయ కోచ్‌గా పల్నాడు యువకుడి సత్తా - Volleyball Coach Srinivasa Rao

అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తే తమ బాధ్యత తీరిపోతుందని కొందరు తల్లిదండ్రులే భావిస్తున్న రోజులు ఇవి. చిన్నవయసులోనే ఎన్నో అవరోధాలను దాటుకుని కెరీర్‌పై ఆశతో ముందుకు కదిలారి అమ్మాయిలు. ఎంచుకున్న లక్ష్యాలను సాధించి, అమ్మాయిలు అంటే భారం కాదు ఇంటికి వెలుగులని నిరూపించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు.

పంచాయతీ కార్యదర్శి టూ సివిల్స్- 5వ ప్రయత్నంలో 50వ ర్యాంక్​తో విజయం - Vaasanthi Ananthapur success story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.