ETV Bharat / state

ఖాకీలకే కష్టమొస్తే? - అధికారుల వేధింపులు ఎడాపెడా సస్పెన్షన్లు - తట్టుకోలేక అఘాయిత్యాలు - HARASSMENT IN TG POLICE DEPARTMENT

Harassment In Telangana Police Department : పోలీసుశాఖలో వేధింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సై శ్రీను మృతితో ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది. డిపార్ట్మెంట్​​లో చెప్పిన పని చేయకపోతే కింది స్థాయి ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులు పెడతారో శ్రీరాముల శ్రీను వీడియోద్వారా తెలిపిన నేపథ్యంలో, పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థపై ప్రత్యేక కథనం.

Harassment in Police Department
Harassment in Police Department (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:03 AM IST

Telangana Police Department Harassment : సామాన్య ప్రజలకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకొంటారు. మరి పోలీసులకే కష్టమొస్తే..? అది కూడా పైఅధికారుల నుంచైతే..? ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా బయటపడాలి? ధైర్యం ఉన్నవాళ్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోవడమో, లేదా సెలవు పెట్టడమో చేస్తుంటారు. ధైర్యం లేనివారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఘటనే ఇందుకు నిదర్శనం. పోలీసుశాఖలో అధికారుల వేధింపులు కొత్త కానప్పటికీ, ఇలాంటి ఘటనలు బయటపడ్డప్పుడు మాత్రమే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత అంతా మరిచిపోతున్నారు. క్రమశిక్షణతో మసలుకోవాల్సిన పోలీసుశాఖలో ఇదే క్రమశిక్షణ కిందిస్థాయి సిబ్బందికి శాపంగా మారుతోంది. తాము చెప్పినట్లు వినకపోతే పైఅధికారులు వేధింపులకు పాల్పడతారనేది బహిరంగ రహస్యమే.

చెప్పింది చేయని వ్యక్తిని వేధింపులకు గురిచేస్తారు. డ్యూటీల మీద డ్యూటీలు వేస్తారు, చేయలేకపోతే చర్యలకు ఉపక్రమిస్తారు. తమ మాట వినని వారికి వరుసగా నైట్‌డ్యూటీ వేయొచ్చు. ఆ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా వైఫల్యంగా చూపిస్తూ పైఅధికారులకు ఫిర్యాదు చేసి చర్యలకు ఉపక్రమించవచ్చు. తనకే ఎందుకు వరుసగా నైట్‌డ్యూటీలు వేస్తున్నారని ప్రశ్నిస్తే, సిబ్బంది కొరత కాబట్టి తప్పడంలేదని చెప్పుతారు. పైఅధికారి తలచుకుంటే ఏదో ఒక కారణం చెప్పి కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది.

సస్పెన్షన్లకు లెక్కేలేదు

  • రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజున 10 నుంచి 15 మంది వరకూ ఏదో ఒక కారణంతో, కింది స్థాయి సిబ్బంది సస్పెండవుతుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలీసుశాఖలో జరుగుతున్నన్ని సస్పెన్షన్లు మరే ప్రభుత్వశాఖలో లేవంటే అతిశయోక్తికాదు. ఇక్కడ అధికారాలు అప్పుడప్పుడూ దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై శ్రీరాముల శ్రీను తన ఇబ్బందులను సీఐకి విన్నవించుకుంటే ఆయన పరిష్కరించకపోగా, అతన్నే సూటిపోటి మాటలతో వేధించేవారని తెలిసింది. పైగా అతనికి మెమోలు ఇచ్చి ఇబ్బంది పెట్టేవారని ఆయన తన వీడియో వాంగ్మూలంలో పేర్కొన్నారు.
  • 2016లో సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైవేకు ఆనుకొని ఉన్న ఈ స్టేషన్‌కు ఇసుక లారీల ద్వారా పెద్దఎత్తున ఆదాయం వస్తుందని, ఈ మామూళ్ల వసూలు కోసం పైఅధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ అప్పట్లో ఆయన ఆరోపించారు. ఆ వేధింపులకు తట్టుకోలేకే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • పదవీ విరమణ చేసిన ఒక ఉన్నతాధికారి తన కిందిస్థాయి సిబ్బందికి నరకం చూపించేవారు. చాలా కాలం కేంద్ర సర్వీసులు, నాన్‌ఫోకల్‌ పోస్టులకు మాత్రమే పరిమితమైన అధికారి ఒకసారి తన క్యాంప్‌ క్లర్క్‌ రాసిన లేఖలో తప్పు వచ్చిందన్న కారణంతో చెంపదెబ్బలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘నేనయితే రెండు దెబ్బలు కొడతా, నువ్వయితే ఐదు దెబ్బలు కొట్టుకో, అది కూడా గట్టిగా శబ్దం వచ్చేలా’ అంటూ ఆదేశించడంతో హడలిపోయిన ఆ ఉద్యోగి తనను తాను చెంపదెబ్బలు కొట్టుకొని తర్వాత మూర్ఛపోయారు.

ఆర్డర్లీ వ్యవస్థదీ ఇదే పరిస్థితి: పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థపై పలు విమర్శలున్నాయి. ముఖ్యంగా 2012లో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్వాలియర్‌ సమీపంలోని జైల్‌పుర్‌ గ్రామం వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆక్టోపస్‌ విభాగానికి అప్పట్లో అదనపు డీజీగా పనిచేసిన వివేక్‌ దూబే దిల్లీలోని తన ఇంట్లో పనిచేసేందుకు మురళీనాథ్‌ అనే కానిస్టేబుల్‌ను పంపారు. అక్కడేం జరిగిందో తెలియదు కానీ, కానిస్టేబుల్‌ మధ్యప్రదేశ్‌లో మరణించారు. అయితే అక్కడి సిబ్బంది హుటాహుటిన మురళీనాథ్‌ మృతదేహాన్ని ఖననం చేయడం విమర్శలకు దారితీసింది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇతర రాష్ట్రాల్లోని తమ ఇళ్లకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ ఘటనతో ఆర్డర్లీ వ్యవస్థలో మార్పులు చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపట్టాలి తప్ప పోలీసుశాఖ నుంచి తీసుకోకూడదని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. తర్వాత అంతా మర్చిపోయారు. ఎస్సై శ్రీను ఆత్మహత్య ఉదంతం లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం పోలీసు సిబ్బందిలో వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో 615 మందికో కానిస్టేబుల్‌ - ఉన్నత స్థాయిలో అదనం, క్షేత్రస్థాయిలో అథమం - TS Police Constable Vacancies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.