Low Rain Rate Telangana 2023-24 : రాష్ట్రంలో చినుకు కినుకు వహించింది. కురవనంటూ అలకబూనింది. వర్షానికి వర్షానికి మధ్య విరామం భారీగా ఉంది. దీంతో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు పంటలకు, నేలకు తేమను ఇచ్చే వర్షాలు (Rains in Telangana) అతి తక్కువగా పడటంతో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. గత సంవత్సరం జూన్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 305 రోజులకుగాను కేవలం 66 రోజులు మాత్రమే వానలు కురిశాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో తెలంగాణలో క్షామ పరిస్థితులు తలెత్తాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ తాజా గణాంకాలు వివరిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎండుతున్న పంటలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Telangana Farmers Worried Crop Loss
తీవ్ర ప్రభావం చూపిన డ్రైస్పెల్స్ : వర్షానికి వర్షానికి మధ్య (కనీసం నాలుగు వారాలు) విరామం రావడాన్ని డ్రైస్పెల్‌గా అంచనా వేస్తారు. తేలికపాటి నేలల్లో మూడు వారాలను పరిగణిస్తారు. ఈ విరామం మధ్య 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం లేదా వాన పూర్తిగా కురవకపోవడాన్ని ఒక స్పెల్‌గా పరిగణిస్తారు.
- డ్రైస్పెల్ భూగర్భ జలమట్టంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వర్షపు నీరు నేలలోకి ఇంకాలంటే విరామం లేకుండా వానలు కురవాల్సి ఉంటుంది.
- ప్రధానంగా నైరుతి రుతుపవన కాలంలో తెలంగాణలోని 612 మండలాల్లో మొత్తం 476 డ్రైస్పెల్స్ నమోదయ్యాయి. ఎక్కువగా సూర్యాపేటలో 37, రంగారెడ్డి 34, సంగారెడ్డి 28, ఖమ్మం 26, నల్గొండ 24, మహబూబాబాద్ 22, హైదరాబాద్ 20, నాగర్‌కర్నూల్ 18, మేడ్చల్ మల్కాజిగిరి 17, భద్రాద్రి కొత్తగూడెం 16, మంచిర్యాల 16, యాదాద్రి భువనగిరిలో 16 డ్రైస్పెల్స్ నమోదయ్యాయి.
- తేలికపాటి నేలల్లో మూడు వారాలను ఒక డ్రైస్పెల్‌గా పరిగణిస్తారు. ఇవి 336 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 33, సూర్యాపేట 33, నల్గొండ 24, ఖమ్మం 24, భద్రాద్రి కొత్తగూడెం 14, మహబూబాబాద్ 18, కామారెడ్డి 13, సంగారెడ్డి 14, యాదాద్రి భువనగిరి 15 డ్రైస్పెల్స్ ఆదిలాబాద్ 10, మంచిర్యాల 16, నిజామాబాద్‌లో 12 నమోదయ్యాయి.
- కఠిన నేలల్లో డ్రైస్పెల్ వ్యవధిని నాలుగు వారాలుగా పరిగణిస్తారు. ఇలాంటివి 140 నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి 13, హైదరాబాద్ 12, నాగర్‌కర్నూల్ 10, వికారాబాద్ 9, మహబూబ్‌నగర్‌లో 7 స్పెల్స్ నమోదయ్యాయి.
- అధిక డ్రైస్పెల్స్ కారణంగా వర్షానికి వర్షానికి మధ్య అంతరం పెరిగి వాగుల్లో నిరంతర ప్రవాహం తగ్గిపోయింది. దీంతో భూగర్భ మట్టాలతో పాటు ప్రాజెక్టుల్లో సైతం నీటి నిల్వలు అడుగంటి నీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్! - Monsoon Forecast 2024 India
2024లో సాధారణ స్థాయిలోనే వర్షాలు- ఏపీ, తెలంగాణలో ఇలా! - Monsoon Prediction 2024