ETV Bharat / state

బ్రేక్​ ఇన్​స్పెక్టర్​పై లారీ డ్రైవర్ల దాడి - ఏం జరిగిందంటే!

తనిఖీకి వెళ్లిన రవాణాశాఖ అధికారిపై లారీ డ్రైవర్ల దౌర్జన్యం - నకిలీ అధికారిగా పొరబడిన డ్రైవర్లు

lorry_drivers_attack_on_brake_inspector_in_ysr_district
lorry_drivers_attack_on_brake_inspector_in_ysr_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Lorry Drivers Attack On Brake Inspector In YSR District : ఎక్కడైనా రవాణా శాఖ అధికారులను చూసి లారీ డ్రైవర్లు పారిపోతారు. కానీ లారీ డ్రైవర్లను చూసి రవాణా శాఖ అధికారి పారిపోయిన ఘటన ఎప్పుడైనా చూశారా? ఏమిటీ ఈ విడ్డూరం అనుకుంటున్నారా? అవునండీ మీరు వింటున్నాది నిజమే. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. నకిలీ అధికారిగా పొరబడి తనిఖీలకు వెళ్లిన రవాణా శాఖ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై లారీ డ్రైవర్లు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నకిలీ అధికారిగా పొరబడి దాడికి యత్నం : పూర్తి వివరాల్లోకి వెళ్తే, కడపలో విజయ్ భాస్కర్ రవాణా శాఖలో బ్రేక్ ఇన్​స్పెక్టర్​ ​గా పనిచేస్తున్నారు. కడప శివారులోని భాకరాపేటలో ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు ఒక హోంగార్డుతో కలిసి అక్కడకి వెళ్లారు. అక్కడ రాజస్థాన్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన లారీలు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ పార్కింగ్‌ చేసి ఉన్న ఇతర రాష్ట్రాల లారీల డ్రైవర్ల వద్దకు విజయ్ భాస్కర్ తనిఖీకి వెళ్లారు.

మందుబాబుల వీరంగం - టోకెన్​ తీసుకోవాలన్నందుకు హోటల్​పై దాడి

మీ గుర్తింపు కార్డు చూపించండి : బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ మఫ్టీలో ఉండటంతో పాటు ప్రైవేట్‌ వాహనంలో వెళ్లాడు. దీంతో అక్కడి లారీ డ్రైవర్లు అనుమానపడ్డారు. ఇతర రాష్ట్రాల డ్రైవర్లు కావడంతో నిజంగా వచ్చింది రవాణా శాఖ అధికారులని గ్రహించలేకపోయారు. దీంతో ఒక్కసారిగా డ్రైవర్లంతా ఏకమై అధికారులపై దౌర్జన్యానికి దిగారు. తాము రవాణా శాఖ అధికారులమని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ వాహనం ఎక్కడ? మీ గుర్తింపు కార్డు చూపించండి. అని లారీ డ్రైవర్లు ప్రశ్నించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ : అనవసరంగా వచ్చి దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నారంటూ లారీ డ్రైవర్లు వాపోయారు. ఒక దశలో బ్రేక్ ఇన్స్పెక్టర్ పై దాడి చేసేందుకు యత్నించారు. ఎంత చెప్పిన లారీ డ్రైవర్లు వినిపించుకోకపోవడంతో బ్రేక్ ఇన్​స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని కారులో కూర్చుండగా తిరిగి ఆ అధికారిని బయటకు లాగి మళ్లీ ప్రశ్నించారు. చివరకు ఏం చేయాలో అర్థం కాక బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రవాణా శాఖ అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

మారణాయుధాలతో వైఎస్సార్​సీపీ నేతల దాడి - టీడీపీ కార్యకర్త దారుణహత్య

కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి పరుగు​- పేషంట్లు, వైద్యులు హడల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.