ETV Bharat / state

"గెలవాలంటే నిలబడాలి" - ఐటీ అభివృద్ధి చంద్రబాబు అద్భుత కృషి ఫలితమే : మంత్రి లోకేశ్

అమరావతిలోని విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శన - ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh speech at VIT University
ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషికి అద్భుత ఫలితాలు వచ్చాయి : మంత్రి లోకేశ్ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 5:05 PM IST

Updated : Nov 7, 2024, 5:15 PM IST

Minister Nara Lokesh speech at VIT University : చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సంస్కరణలు, ఐటీ అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్లే నేడు అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు కీలక పదవుల్లో ఉన్నారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ (Minister Nara Lokesh) అన్నారు. అమరావతిలోని విట్ యూనిర్శిటీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా ప్రదర్శనను లోకేశ్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రూపొందించిన కొత్త ఆవిష్కరణలను తిలకించారు.

Lokesh Inaugurated International Education Exhibition Organized at Vit University : ఈ సందర్భంగా లోకేశ్​ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యకి, మన విద్యకు చాలా తేడా ఉందని అన్నారు. ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని మంత్రి లోకేశ్‌ తెలిపారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు. రాబోయే రోజుల్లో మనం కూడా అలాంటి అత్యున్నత విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గెలుపు కోసం ఎవరి దారి వాళ్లే వేసుకోవాలని అప్పుడే ఎన్నో అనుభవాలు వస్తాయని తెలిపారు.

విదేశీ పర్యటనలో ఉన్నా భరోసా - ప్రజా సమస్యలపై లోకేశ్ ప్రత్యేక దృష్టి

మంగళగిరిలో మొదటి సారి ఓడినా, రెండో సారి గెలుపు కోసం శ్రమించానని గుర్తు చేశారు. సింగపూర్, చైనా మోడల్స్ అని మాట్లాడుకున్నట్లే ఇండియా మోడల్ గురించి కూడా ప్రపంచం మాట్లాడుకోవాలన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

'ఐటీ రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయి. దీంతో మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. విదేశాల్లో ఇప్పుడు మన తెలుగు వాళ్లు మంచి స్థానాల్లో ఉన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటను విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలి. రాబోయే 25 ఏళ్లలో ఇండియా మరింత అభివృద్ధి చెందనుంది. వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగేందుకు అవకాశం ఉంది.'

- మంత్రి లోకేశ్‌

బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్

Last Updated : Nov 7, 2024, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.