ETV Bharat / state

ఆలేరు రెవెన్యూ డివిజన్​ కల నెరవేరేనా? స్థానికుల్లో మళ్లీ చిగురించిన ఆశలు - Locals Demand For Revenue Division

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 10:50 PM IST

Locals Demand Revenue Division For Aleru : ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గంలో 8 మండలాలు 72 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రాజధానికి సమీపంలో ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రం సైతం ఇక్కడే ఉందని, డివిజన్ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా తమ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతున్నారు

Locals Demand Revenue Division For Aleru

Locals Demand Revenue Division For Aleru : ఆలేరు పరిసర ప్రాంత ప్రజలు తమ చిరకాల కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ఇక్కడి ప్రజలు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట ప్రపంచ స్థాయి క్షేత్రంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఆలేరు రెవెన్యూ డివిజన్‌(Revenue Division) ఏర్పాటుకు మరింత డిమాండ్‌ పెరిగింది. ప్రజల మనోభావాలను గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు 2021 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విషయాన్ని వివరించారు. డివిజన్‌ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అనంతర కాలంలోనే అవి అటకెక్కాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దృష్టికి రెవెన్యూ డివిజన్‌ విషయాన్ని తీసుకెళ్లడంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది.

People Demand For Revenue Division : ఆలేరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఆలేరు, యాదగిరిగుట్(Yadadri)ట, రాజపేట, మోటకొండూరు, గుండాల మండలాలను కలిపి రెవెన్యూ డివిజిన్​గా ఏర్పాటు చేయాలని పరిసర ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రతిపాదించిన ఐదు మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సుమారు 1.83 లక్షల జనాభా ఉంటుంది. రెవెన్యూ మండలాలు భౌగోళికంగా ఆలేరుకు సమీపంలో ఉన్నాయి. ఆలేరు పట్టణం హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై ఉంది. రైల్వేస్టేషన్‌ సదుపాయం, కొలనుపాకలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జైన ఆలయం, సోమేశ్వరాలయం, ఆర్కియాలజి మ్యూజియం, యాదాద్రి పుణ్యక్షేత్రం రెవెన్యూ డివిజన్‌కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ జనాభా, 8 మండలాలతో జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది.

ఆలేరు రెవెన్యూ డివిజన్‌ కోసం అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటాలు నిర్వహించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు(Aleru Division) వినతిపత్రాలు అందజేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయి. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో మళ్లీ ఈ అంశం తెరమీదపైకి వచ్చింది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad

Aleru Revenue Division Issue : ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును కోరుతూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 2021 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజల మనోభావాలు, రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో జరగనున్న అభివృద్ది తీరును వివరిస్తూ సీఎంను ఒప్పించారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెవెన్యూ డివిజన్ అంశం మళ్లీ మెుదటికి వచ్చింది. ఇటీవల ఎన్నికల్లోనూ ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ప్రధాన అంశంగా మారింది. స్థానికంగా జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు స్పష్టమైన హామీనిచ్చారు. 100 రోజులు గడిచినా దానిపై స్పష్టత లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలేరు రెవెన్యూ డివిజన్​ కల నెరవేరేనా? స్థానికుల్లో మళ్లీ చిగురించిన ఆశలు

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్‌ - సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించిన కేంద్రం - crpf security to Razakar producer

పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు - Minister Jupally about Crop Loss

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.